అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన తొలి పాన్ ఇండియా చిత్రం… పుష్ప. 17న విడుదల అవుతోంది. ఇప్పటికే మిగిలిన భాషల్లో సరైన ప్రచారం లభించడం లేదని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఈ నేపథ్యంలో.. పుష్పకి మరో స్పీడ్ బ్రేకర్ పడింది. ఈ సినిమా హిందీ సెన్సార్ ఆగిపోయింది. పూర్తి సినిమా ఇస్తే గానీ, ఈ సినిమాని సెన్సార్ చేయలేమని సెన్సార్ బోర్డు వ్యక్తం చేసింది. ఓ వైపు పుష్పకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అంతలోనే ఈ సినిమాని ముక్కలు ముక్కలుగా సెన్సార్ బోర్డుకు పంపారు. దాంతో పాటుగా ఆర్.ఆర్ సింక్ కుదరడం లేదని తెలుస్తోంది. దీనిపై సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది. ముక్కలు ముక్కలుగా సినిమాని సెన్సార్ చేయలేమని, పూర్తి స్థాయి ప్రింట్ తోనే సెన్సార్ చేస్తామని సెన్సార్ బోర్డు స్పష్టం చేసింది. రెండు రోజుల్లో సినిమా విడుదల చేయాలి. ఈలోగా సెన్సార్ బోర్డు ఇలా ప్రతి స్పందించడంతో చిత్ర బృందం షాక్ కి గురి అయ్యింది. పూర్తి స్థాయి కాపీ ఎప్పుడు పంపుతారో.. ఎప్పుడు సెన్సార్ చేస్తారో… అది ఎప్పుడు క్యూబ్స్కి ఎక్కిస్తారో.. ఇలాగైతే పుష్ప హిందీ వెర్ఱన్ అనుకున్న సమయానికి రావడం కష్టమే.