పుష్ప సినిమాకు ఆంద్రప్రదేశ్లో టిక్కెట్ రేట్లు పెంచుకునే అవకాశం కష్టంగానే కనిపిస్తోంది. టిక్కెట్ రేట్ల పెంపు కోసం ధియేటర్ యాజమాన్యాలు సంబంధిత జాయింట్ కలెక్టర్కు దరఖాస్తు చేసుకోవాలని హైకోర్టు సూచించింది. ఆయన నిర్ణయాన్ని బట్టే పెంపు ఉంటుందాలేదా అన్నది ఉంటుంది. గతంలో ఇదే విధానం ఉండేది. అయితే అప్పట్లో తొలి రెండు వారాలు టిక్కెట్ రేట్ల పెంపునకు జాయింట్ కలెక్టర్లు అభ్యంతర చెప్పేవారు కాదు. ప్రభుత్వం కూడా ఓకే అనేది. కానీ ఇప్పుడు ప్రభుత్వం మాత్రం టిక్కెట్ రేట్ల పెంపునకు ససేమిరా అంటోంది.
ఈ కారణంగా ధియేటర్ యాజమాన్యాలు దరఖాస్తు చేసుకున్నా జాయింట్ కలెక్టర్లు టిక్కెట్ రేట్లు పెంచేందుకు అనుమతించరు. హైకోర్టులో విచారణ సోమవారానికి వాయిదా పడింది. శుక్రవారమే పుష్ప రిలీజ్ కానుంది. దీంతో పుష్ప సినిమాకు మామూలు టిక్కెట్లతోనే కలెక్షన్లు రానున్నాయి. అంటే సగం కన్నా తక్కువ ఆదాయం వస్తుందని డిస్ట్రిబ్యూటర్లు ఆందోళన చెందుతున్నారు. అయితే ప్రభుత్వం పుష్పను కాస్తంత కరుణించి జాయింట్ కలెక్టర్లకు రేట్లు పెంచుకోవచ్చని సంకేతాలు ఇస్తే వారు కూడా పర్మిషన్ ఇస్తారు.
అంటే జగన్ చేతిలోనే పుష్ప టిక్కెట్ రేట్ల పెంపు ఆధారపడి ఉందన్నమాట. అయితే ప్రభుత్వం ఆ పర్మి,షన్ ఇస్తుందాలేదా అన్నది నేడు తేలిపోనుంది. ఒక వేళ ప్రభుత్వం అదే మాటకు కట్టుబడి ఉంటే అఖండలాగే పుష్ప కూడా కలెక్షన్లు తక్కువాగనే ఉండనున్నాయి. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు భారీ ఆర్థిక నష్టం కలగనుంది.