తెలంగాణ సీఎం కేసీఆర్ ..ప్రజాప్రతినిధులు, నేతల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి మళ్లీ గల్లీలోనే బీజేపీకి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. మొదటి సారి నియోజకవర్గాల్లో ధర్నాలు..రెండో సారి ఇందిరా పార్క్ వద్ద ధర్నాలు చేపట్టిన కేసీఆర్ ఈ సారి మాత్రం స్టైల్ మార్చారు. నిరసనలకు మాత్రం పిలుపునిచ్చారు. ఈ నిరసనల్లో బీజేపీ, కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మలు తగుల బెట్టాలన్నారు.
ఈ కార్యక్రమం ఇరవయ్యో తేదీన జరుగుతుంది. శనివారం ఢిల్లీకి మంత్రుల బృందాన్ని కూడా పంపుతున్నామని కేసీఆర్ తెలిపారు. సింగరేణి గనుల ప్రైవేటీకరణ అంశంపైనా కేంద్రం తీరుపై కేసీఆర్ అసంతప్తి వ్యక్తం చేశారు. కేసీఆర్ కేంద్రంపై తన పోరాటాన్ని ఢిల్లీకి తీసుకు వెళ్తారని అనుకున్నారు కానీ ఆయన మాత్రం ఇంకా గల్లీల్లోనేఉంచాలని నిర్ణయించారు. మీటింగ్లోపార్టీ నేతలకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశఆరు. నిరంతరం ప్రజల్లో ఉండాలని, కష్టపడి పని చేయాలని ఎమ్మెల్యేలకు సూచించారు.
వచ్చే ఎన్నికల్లోనూ గెలిపించుకునే బాధ్యత తనదే అని కేసీఆర్ వారికి హామీ ఇచ్చారు. ఇటీవల రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల పదవులను భర్తీ చేయడం ప్రారంభించారు. పార్టీ కోసం పని చేసిన వారికి పదవులు వస్తాయని కాస్త ఓపిక పట్టాలని సూచించారు. అత్యవసరంగా ఏర్పాటు చేసిన సంయుక్త కార్యవర్గసమావేశంలో దిష్టిబొమ్మలు తగులబెట్టాలని మాత్రమే కీలకమన సూచన చేయడంతో టీఆర్ఎస్ నేతలు ఊసూరుమన్నారు.