ప్రభుత్వంపై కోర్టుకెళ్లినందుకు ఏపీలో ధియేటర్లకు సినిమా చూపించేందుకు ప్రభుత్వం సిద్ధమయిది. బూజుపట్టిన నిబంధనలన్నింటినీ దులిపి… ఆ రూల్ బుక్‌తో ధియేటర్లపైకి అధికారులు దండెత్తబోతున్నారు. ఏ చిన్న లోపం కనిపించినా సీజ్ చేసి.. రూ. లక్షల ఫైన్ వేసేందుకు రంగం సిద్ధమయినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని వందల ధియేటర్లకు నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వం టిక్కెట్ రేట్ల పెంపునకు అనుమతి ఇవ్వకపోవడతో కొన్ని ధియేటర్ల యాజమాన్యాలు కోర్టులకు వెళ్లాయి.
హైకోర్టు జీవోను సస్పెండ్ చేసి.. పాత విధానంలోనే టిక్కెట్ రేట్లను ఖరారు చేయాలని తీర్పు ఇచ్చింది. అయితే ఆ తీర్పు కేవలం కోర్టుో పిటిషన్లు వేసిన ధియేటర్లకే వర్తిస్తుంది. ఇప్పుడు ఆ ధియేటర్లను మార్క్ చేసుకున్న ప్రభుత్వం… అధికారులతో దాడులకు రంగం సిద్ధం చేసుకుంది. అసలే కరోనా కాలం.. ఆ పైన టిక్కెట్ రేట్ల కుదింపుతో .. ఇక మూసివేతే మార్గమనుకుంటున్న దశలో ప్రభుత్వ వేధింపులు మరింతగా వారిని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి.
ఏపీలో ఏ ఒక్క వ్యాపారవర్గం కూడా ప్రశాంతంగా తమ వ్యాపారాలను కొనసాగించుకునే పరిస్థితి లేదు. ప్రభుత్వం అడ్డగోలు నిబంధనలతో మొత్తంగా ఆయా వ్యాపారాలకు ఎన్ని అడ్డంకులు సృష్టించాలో అన్నీ సృష్టించేసింది. ఇప్పుడు ధియేటర్లనూ మూత వేస్తారని ఇండస్ట్రీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. మొత్తంగా చూస్తే ఈ సారి ధియేటర్ల వంతు అని అనుకోవాలి.