అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకి మిశ్రమ రివ్యూలు వచ్చాయి. అయితే సినిమాలో ఒక సీన్ పై చాలా మంది విమర్శకులు, కొంతమంది ప్రేక్షకులు కూడా పెదవి విరిచారు. పుష్ప,.. శ్రీ వల్లి భుజం పై చేయి వేసి ఫోన్ మాట్లాడిన సీన్, తర్వాత పుష్ప చేయి శ్రీవల్లి ప్రైవేట్ పార్ట్స్ పై వున్నట్లుగా కన్వే అయ్యే షాట్.. కొంచెం ఇబ్బందిగా అనిపించింది. పుష్ప రా సినిమా. ఎంత రా సినిమా అయినప్పటికీ అలాంటి సీన్ పెట్టి వుండకూడదనే అభిప్రాయం వ్యక్తమైయింది. నిజానికి ఇది సుకుమార్ స్టయిల్ కూడా కాదు. ‘సుక్కు సర్ ఏంటి ఇలా తీశారు” అని చాలా మంది ముక్కున వేలేసుకున్నారు. ఈ ఫీడ్ బ్యాక్ అంతా సుకుమార్ దగ్గరికి వెళ్ళింది. దీంతో సుకుమార్ నేరుగా రంగంలో దిగి.. ఆ సీన్ తొలగించాలని నిర్ణయించడం, తొలగించడం జరిగింది. రేపటి (ఆదివారం) నుంచి ఎడిటెడ్ వెర్షన్ ని ప్రదర్శిస్తారు. మొత్తానికి సుకుమార్ మంచి నిర్ణయమె తీసుకున్నారు. పుష్ప ఫ్యామీలీ సినిమా కూడా. కానీ అ సీన్ కారణంగా మొదటి రోజు ఫ్యామిలీ ఆడియన్స్ ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు తొలగించడంతో ఫ్యామిలీతో పాటు సుకుమార్ ఫాన్స్ కూడా హ్యాపీ.