పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ విషయంలో మగవాళ్లను కించ పరిచారంటూ పనిలేని కొంత మంది మేధావులు మీడియా, సోషల్ మీడిాయలో చర్చ పెట్టి.. తమనే అన్నారని తెగ బాధపడిపోతున్నారు. వారి బాధను “వ్యూ”స్‌గా మార్చుకోవడానికి కొంత మంది పరుగులు తీస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఈ పాటపై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కొత్త వాదన తీసుకు వచ్చారు. అందరూ ఆ పాటలో మగవాళ్లను కించ పరిచారని అంటూంటే.. ఆయన మాత్రం దేవడ్ని కించ పరిచారని ఆరోపిస్తున్నారు.
అంతటితో వదిలి పెట్టలేదు. నేరుగా పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. భక్తి పాటను.. ఐటమ్ సాంగ్ తరహాలో రాశారని.. వెంటనే మ్యూజిక్ డైరక్టర్ దేవిశ్రీప్రసాద్‌పై చర్యలు తీసుకోవాలనిడిమాండ్ చేశారు. దేవి శ్రీ ప్రసాద్ వ్యహారాల శైలితో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని.. ఆయన లేఖలో చెప్పుకొచ్చారు. ఎక్కడెక్కడ దెబ్బతిన్నాయో లేఖలో వివరించారు.
దీంతో సమంత ఐటమ్ సాంగ్‌కు ఇప్పుడు మరో తరహా పబ్లిసిటీ రావడం ఖాయమైపోయింది. హిందూ యాంగిల్‌ను జోడించడంతో మరింత రచ్చ జరగొచ్చు. ఇటీవల దేవీ శ్రీప్రసాద్ తన దృష్టిలో దేవుడి పాటలు.. ఐటం సాంగ్స్ వేర్వేరు కాదంటూ చెప్పుకొచ్చి కలకలం రేపారు. ఇప్పుడు రాజాసింగ్ఈ వివాదాన్ని అందుకున్నారు. ఇలాంటి వాటితో రాజకీయం చేయడం రాజాసింగ్ స్టైల్.