శ్రీవారి భక్తులు అంటే టీటీడీకి డబ్బులు పండించే వృక్షాలుగా కనిపిస్తున్నట్లుగా ఉంది. ఉదయాస్తమాన సేవ పేరుతో టిక్కెట్లు అమ్మాలని టీటీడీ కొత్తగా నిర్ణయించింది. ఆ టిక్కెట్ ధరలను రూ. కోటి నుంచి కోటిన్నర వరకూ ఖరారు చేసింది. మామూలు రోజుల్లో రూ. కోటి.., శుక్రవారం రోజుల్లో అయితే రూ.కోటిన్నర అని టీటీడీ డిసైడ్ చేసింది. ఉదయాస్తమాన సేవ అంటే.. ఉదయం నంచి రాత్రి వరకూ శ్రీవారి సేవల్లో భక్తుడు పాల్గొనే అవకాశం కల్పించడం. శ్రీవారికి తెల్లవారుజామున ప్రారంభమయ్యే సేలవను.. అర్థరాత్రి నిద్రపుచ్చే వరకూ అన్ని సేవల్లోనూ పాల్గొనేలా అనుమతిస్తారు.
ఇందు కోసం .. అంత భారీ టిక్కెట్ పెట్టారు. ఇలా కేవలం 521 టిక్కెట్లు అమ్మాలని నిర్ణయించుకున్నారు. ఒక్క సారిగా రూ..కోటి. కోటిన్నర పెట్టి టిక్కెట్ కొంటే… పాతికేళ్ల పాటు.. ఏడాదిలో ఒక్క రోజు పాటు సేవల్లో పాల్గొనవచ్చు. ఈ డబ్బులన్నీ టీటీడీ కోసం కాదని… టీటీడీ తరపున నిర్మించే చిన్న పిల్లల ఆస్పత్రి కోసమని అధికారవర్గాలు చెబుతున్నాయి. టిక్కెట్ల ద్వారా వచ్చే డబ్బులన్నీ.. పిల్లల ఆస్పత్రిని నిర్మిస్తామంటున్నారు. నిజానికి పిల్లల ఆస్పత్రి నిర్మాణానికి వందల కోట్ల విరాళం ఇచ్చి.. నిర్మించి మరీ ఇస్తామని ముంబైకి చెందిన ఓ సంస్థ వచ్చిందని.. ఆ సంస్థతో ఎంవోయూ కూడా చేసుకున్నారు.
భూమి అప్పగించేందుకు సిద్ధమయ్యారు. అప్పగించారో లేదో స్పష్టత లేదు. ఆ తర్వాత ఆ సంస్థ టర్నోవర్ కేవలం రూ. లక్షలోపే అని తేలింది.. వివాదాస్పదమయింది. ఆ ఒప్పందం ఏమయిందో కానీ ఇప్పుడు ఉదయాస్తమాన సేవ పేరుతో టిక్కెట్లు అమ్మి చిన్న పిల్లల ఆస్పత్రి కట్టాలనుకుంటున్నారు.