ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీలో తెలుగు మీడియంను అంతమొందించాలని నిర్ణయం తీసుకుంది. మాతృభాషలోనే బోధన చేయాలని కేంద్రం కొత్త విద్యావిధానం తెచ్చినా… విద్యాహక్కు చట్టం కింద అలాంటి ప్రయత్నం చేయడం సాధ్యం కాదని తెలిసినా ముందుకే వెళ్తోంది. ప్రస్తుతం ఈ కేసు కోర్టు పరిధిలో ఉంది. అయినప్పటికీ మౌఖికంగా ఇంగ్లిష్ మీడియం మాత్రమే ఉండాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. ప్రభుత్వ ప్రయత్నాలు ఎలా.. తెలుగు భాషలో ఉన్నత విద్య అందుబాటులోకి వస్తోంది. ఇంజినీరింగ్ కోర్సులు ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి వచ్చాయి.
ఈ మేరకు కాలేజీలకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి అనుమతిచ్చింది. ఈ విద్యా సంవత్సరం నుంచి తెలుగు, హిందీ, తమిళం, మరాఠీ, బెంగాలీ భాషల్లో కోర్సులను బోధించనున్నారు. ఇందుకోసం ఇంజనీరింగ్ కోర్సులను ఏఐసీటీఈ ప్రాంతీయ భాషల్లోకి అనువదించింది. ఏఐసీటీఈ సర్వే నిర్వహించగా దాదాపు సగం మంది ఇంజనీరింగ్ విద్యార్థులు తాము మాతృభాషలో చదవాలని అనుకొంటున్నట్టు చెప్పారు. దీంతో తెలుగు మీడియంలో ఇంజనీరింగ్ కోర్సులకు అనకాశం కల్పించింది. ఏపీలోని పలు కాలేజీల్లో తెలుగు మీడియంలో ఇంజినీరింగ్ విద్యార్థులు చేరారు. అయితే ఎన్బీఏ గుర్తింపు ఉన్న కాలేజీల్లో ప్రస్తుతం తెలుగు మీడియంలో ఇంజినీరింగ్ క్లాసులు జరుగుతాయి.
ఇది పూర్తిగా రాష్ట్రానికి సంబంధం లేని విషయం. కాన .. అసలు తెలుగు ఉనికే లేకుడా చేద్దామనుకున్న ప్రభుత్వానికి ఈ నిర్ణయం కాస్త ఇబ్బందికరమే. మాతృభాషను ఓ సబ్జెక్ట్గా మాత్రమే ఉంచాలని ప్రభుత్వం ప్రయత్నిస్తూంటే.. భారతీయ భాషల గొప్పతనాన్ని కాపాడాలని కేంద్రం.. ఉన్నత విద్యలోనూ తెలుగు మీడియంను తెస్తోంది.