తెలంగాణలో భారీ బియ్యం స్కాం జరిగిందని దీనిపై త్వరలోనే చర్యలుంటాయని తెలంగాణ బీజేపీ నేతలను పిలిచి మరీ అమిత్ షా గుడ్ న్యూస్ చెప్పారు., తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు ప్రభుత్వ పెద్దలతో కుమ్మక్కయి..పెద్ద ఎత్తున బియ్యం సేకరణలో స్కాంకు పాల్పడ్డారని.. త్వరలో దీనికి సంబంధించిన వివరాలన్నీ బయటకు వస్తాయి.. కేసీఆర్ పై పోరాటంలో ఎవరూ వెనక్కి తగ్గవద్దని అమిత్ షా బీజేపీ నేతలకు సూచించారు.
ధాన్యం కొనుగోలు అంశంపై టీఆర్ఎస్ నేతలు.. బీజేపీని కార్నర్ చేసి రాజకీయం చేస్తూండటం.. అదే పనిగా ఢిల్లీకి వచ్చి అపాయింట్మెంట్లు ఇవ్వకుండా అవమానిస్తున్నారని ప్రకటనలు చేస్తూండటం వంటి అంశాలపై చర్చించేందుకు టీఎస్ బీజేపీ ముఖ్య నేతల్ని హైకమాండ్ ఢిల్లీకి పిలిపించింది. బండి సంజయ్, ఈటల , విజయశాంతి సహా ముఖ్య నేతలంతా ఢిల్లీ వెళ్లారు. కిషన్ రెడ్డితో సహా అమిత్ షాతో భేటీ అయ్యారు. కేసీఆర్ అవినీతిపై పోరాటం చేయాలని… ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రెడీగా ఉండాలని షా దిశానిర్దేశం చేసినట్లుగా తెలుస్తోంది.
టీఆర్ఎస్ పై పోరాటానికి మీరు చేయగలిగినదంతా చేయండి..ప్రభుత్వ పరంగా ఏంచేయాలో తాము చూసుకుంటామని భరోసా ఇచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిపై పోరాడాలని సలహా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా ధాన్యం కొనుగోళ్ల అంశంలో తమనే రైతుల దృష్టిలో దోషిగా చేసేందుకు కేసీఆర్ ప్రయత్నించడానికి గట్టి కౌంటర్ ఇవ్వాలని అమిత్ షా దిశానిర్దేశం చేసినట్లుగాతెలుస్తోంది. మొత్తంగా చూస్తే త్వరలో.. తెలంగాణలో భారీ స్కాం తరహా రాజకీయాలు వెలుగు చూసే అవకాశం కనిపిస్తోంది.