కోర్టుకు హాజరు నుంచి మినహాయింపు కోసం హైకోర్టులో పిటిషన్ వేశాం… కోర్టు తీర్పు రావాల్సి ఉంది. అందుకే కోర్టుకు హాజరు కావడం లేదని .. ఏపీ సీఎం జగన్ సీబీఐ కోర్టులో మెమో దాఖలు చేశారు. జగన్ అక్రమాస్తుల కేసులో విచారణకు హాజరు కావాల్సినప్పుడల్లా జగన్మోహన్ రెడ్డి ఏదో ఓ కారణం చెప్పి గైర్హాజర్ అవుతున్నారు. చాలా సార్లు ముందస్తుగా మెమో దాఖలు చేసినా… కొన్ని సార్లసలు సమాచారమే ఇవ్వడం లేదు. ఈ అంశంపై సీబీఐ కోర్టు న్యాయమూర్తి తాజాగా అసహనం వ్యక్తం చేశారు.
ప్రతీ విచారణకు మినహాయింపు కోరుతున్నారని ..విచారణకు ఎందుకు హాజరు కావడం లేదని సీబీఐ కోర్టు ప్రశ్నించింది. హాజరు మినహాయింపుపై హైకోర్టులో తీర్పు రావల్సి ఉందని అందుకే రావడం లేదని జగన్ తరపు న్యాయవాది చెప్పారు. ఇదే వివరాలతో మెమో రూపంలో సమర్పించాలని జగన్ కు సీబీఐ కోర్టు ఆదేశించింది. అదే మెమో సమర్పించారు కూడా. ఎవరైనాకోర్టులో తీర్పు వచ్చి … విచారణకు హాజరు కాకుండా మినహాయింపు వస్తే హాజరు కాకుండా ఉంటారు.
కానీ సీఎం జగన్ మాత్రందానికి విరుద్ధం కోర్టులో పిటిషన్ వేసి…. కోర్టుకు డుమ్మా కొడుతున్నారు. అదే విషయాన్ని ఆయన కోర్టుకు కూడా చెబుతున్నారు. దీంతో హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత … ఒక వేళ హాజరు కావాల్సిందేనని హైకోర్టు తీర్పు చెబితే… సీబీఐ కోర్టు ఎలా స్పందిస్తుందనేది న్యాయవర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.