కేసీఆర్ ఫాం హౌస్ ఉన్న గ్రామం ఎర్రవెల్లిలో రచ్చ బండ పెట్టి రైతుల సమస్యలను పరిష్కరిస్తామన్న కాంగ్రెస్ పార్టీ నేతలకు పోలీసులు షాకిచ్చారు. ఇంట్లో నుంచి ఎవరూ అడుగు బయట పెట్టకుండా ఎక్కడిక్కకడ అరెస్ట్ చేశారు. రేవంత్ రెడ్డి బయటకు వచ్చి గజ్వేల్ వెళ్లడానికి ప్రయత్నించినా.. పెద్ద ఎత్తున పోలీసులు చుట్టు ముట్టి… ఆయనను అదుపులోకి తీసుకున్నారు. నిజానికి ఎర్రవెల్లిలో కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లుచేయాలనుకున్నారు. కానీ ఎక్కడైతే కాంగ్రెస్ నేతలు రచ్చ బండ నిర్వహించాలనుకున్నారో అక్కడే టీఆర్ఎస్ నేతలు టెంట్ వేసేశారు.
కాంగ్రెస్ నేతల్ని ఏర్పాట్లు సమయంలోనే అడ్డుకున్నారు. అయితేఎక్కడైనా నిర్వహించితీరుతామని కాంగ్రెస్ నేతలు బయలుదేరారు. ఎర్రవెల్లిలోని సీఎం కేసీఆర్ ఫాంహౌస్‌లో నూటయాభై ఎకరాల్లో వరి పండిస్తున్నారని..కానీ ఆయనే రైతులను వరి వేయవద్దని అంటున్నారని.. ఈ విషయాన్ని తాము బయట పెడతామని కాంగ్రెస్ నేతలు చెబుతూవస్తున్నారు. సాధారణంగా గజ్వేల్‌కు కాంగ్రెస్ నేతలు అంటేనే పోలీసులు అలర్ట్ అవుతారు… ఇక ఫాం హౌస్ అంటే ఊరుకుంటారా. ..? రెండురోజుల ముందు నుంచే హౌస్ అరెస్టులకు ప్లాన్ చేసి కార్యక్రమాన్ని భగ్నం చేశారు. నిజానికి అనేక మంది కాంగ్రెస్ నేతలకు ఈ కార్యక్రమం జరుగుతుందన్న నమ్కకం లేదు. కే
సీఆర్ హౌస్అరెస్టులు చేయిస్తారని అందరూ అనుకున్నారు. అనుకున్నట్లుగానే జరిగింది.అయితే ముందస్తు ప్రణాళిక ..,బీ ప్లాన్ లేకుండా ఇలాంటి కార్యక్రమాలను ఎలా సక్సెస్ చేస్తారని.. హౌస్ అరెస్టులయిపోతే… ఏం రాజకీయంపోరాటం చేసినట్లన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గత నాలుగేళ్లుగా కాంగ్రెస్ నేతలు ఏదైనా ఆందోళన కార్యక్రమం చేపడితే హౌస్ అరెస్టులనే వ్యూహాన్ని పోలీసులు అమలు చేస్తున్నారు. దానికి కాంగ్రెస్ నేతల వద్ద విరుగుడు లేకుండా పోయింది.