సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే, టీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి టీ పీసీసీ చీఫ్‌తో పోరాటాన్ని వ్యక్తిగతంగా తీసుకుంటున్నారు. ఆయనను ఆ పదవి నుంచి తప్పించాలని శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. వ్యక్తిగత ఇమేజ్ కోసం రేవంత్ పని చేస్తున్నారని పార్టీ కోసం పని చేయడం లేదని కొత్తగా ఆరోపిస్తూ పార్టీ హైకమాండ్‌కు లే్ఖలు రాస్తున్నారు. ఆయనను తప్పించాలని లేకపోతే.. ఆయన పనితీరును మార్చాలని ఆయన కోరుతున్నారు. పనితీరును మార్చడం అంటే సీనియర్లు అందరితో రేవంత్ రెడ్డి మాట్లాడి .. బుజ్జగించి పార్టీ కార్యక్రమాలను ఖరారు చేయడం అన్నమాట.
రేవంత్ రెడ్డి ఎర్రవెల్లి ఫాంహౌస్‌లో రచ్చబండ చేస్తామని ప్రకటించారు. దీనిపై జగ్గారెడ్డికి సమాచారం లేదు. మెదక్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేనైన తనకు సమాచారం లేకుండా ఇలాంటి ప్రోగ్రాం పెడతారా అని జగ్గారెడ్డి ఫైరయ్యారు. తాను వెళ్లబోనని ముందే ప్రకటించారు. ఆ తర్వాత రేవంత్ రచ్చ బండ ప్రోగ్రాం నుంచి దృష్టి మళ్లించేందుకు ఎంత చేయాలో అంత రచ్చ చేశారు. చివరికి లేఖ రాశారు.
జగ్గారెడ్డికి రేవంత్ కు పీసీసీ చీఫ్ ఇవ్వడం మొదటి నుంచి ఇష్టం లేదు. ఆయన పదవి ప్రకటించక ముందే చాలా సార్లు రేవంత్‌కు వ్యతిరేకంగా మాట్లాడారు . అయితే పదవి ప్రకటించిన తర్వాత సైలెంట్ కాస్త కూల్ అయ్యారు కానీ.. అన్నీ తనతో చర్చంచడం లేదని ఫీల్ అవుతున్నారు. తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. హైకమాండ్ ఆగ్రహం వ్యక్తం చేసినాఆయన వెనక్కి తగ్గడం లేదు.