హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. బాలకృష్ణ ఇంటిని వైసీపీ కార్యకర్తలు ముట్టడించడం ఉద్రిక్తతకు దారితీసింది. వివరాల్లోకి వెళితే.. పట్టన సమీపంలో డంపింగ్ యార్డ్ తరలించే విషయంలో జాప్యం జరుగుతోంది. ఈ విషయంలో స్థానిక టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.
ఈ విషయంలో టీడీపీ నేత సోషల్మీడియాలో పోస్ట్ చేయడంతో ఆగ్రహించిన అధికార పార్టీ కార్యకర్తలు, నేతలు బాలకృష్ణ ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని వైసీపీ నాయకులని నివారించారు. ఈ క్రమంలో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. టీడీపీ నాయకులు ‘జై బాలయ్య’ అని నినాదాలు చేస్తే వైసీపీ నాయకులు జై జగన్ నినాదాలతో హోరెత్తించారు. పరిస్థితి అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు శ్రమించాల్సివచ్చింది.