టాలీవుడ్ లో హిట్టయిన సినిమాలన్నీ బాలీవుడ్ కి రీమేక్ రూపంలో వెళ్లడం ఆనవాయితీగా మారిపోయింది. ఇప్పుడు బాలీవుడ్ చూపు.. అఖండ పై పడింది. బాలకృష్ణ – బోయపాటి కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న చిత్రమిది. బాక్సాఫీసు దగ్గర ఘన విజయాన్ని అందుకుంది. బాలకృష్ణ కెరీర్లోనే అతి పుద్ద హిట్ గా నిలిచింది. ఈ సినిమాని బాలీవుడ్ లోకూడా రీమేక్ చేస్తారని వార్తలొస్తున్నాయి. వీటిపై నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. బాలీవుడ్ లో అఖండ రీమేక్ చేసే అవకాశం ఉందని, ఒక వేళ రీమేక్ చేస్తే అక్షయ్ కుమార్, అజయ్ దేవగణ్ నటిస్తే బాగుంటుందన్నారు మిర్యాల. అంతే కాదు.. అఖండ 2కి కూడా స్కోప్ ఉందట. “అఖండ 2 వస్తే బాగుంటుంది. నిర్మాతగా నా ఆశ ఇది. మరి బోయపాటి శ్రీనుమైండ్ లో ఏముందో తెలీదు“ అని చెబుతున్నారాయన. “ఈ సినిమా విడుదలైన నాలుగు రోజుల్లోనే బయ్యర్లు లాభాల బాట పడతారని నాకు తెలుసు. అలానే అయ్యింది. అయితే ఓవర్సీస్ లో ఇంత ఆదరణ లభిస్తుందని అనుకోలేదు. బాలకృష్ణతో సినిమా చేయడం గొప్ప అవకాశం. మళ్లీ మళ్లీ ఆయనతో సినిమాలు చేయాలని వుంద“న్నారు మిర్యాల. మరి అఖండ 2కి నిర్మాత రెడీగా ఉన్నాడు. బోయపాటి శ్రీను ఏమంటాడో చూడాలి.