వివేకా హత్యకేసులో సీబీఐ దర్యాప్తు అధికారిపైనే నిందితులు ఆరోపణలు చేస్తూ..కోర్టులకు.. పోలీసుల వద్దకు వెళ్తున్నారు . దీంతో సీబీఐ అధికారులు కూడా ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో కేసును చేధించడానికి సీబీఐ అధికారులు ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. సీబీఐ అధికారుల ముందు ఇప్పుడు ఉన్న కీలక ఆధారం..దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి. ఆయనకు నార్కో పరీక్షలు నిర్వహిస్తే మొత్తం బయటపడుతుందని నమ్ముతున్నారు. అందుకే కోర్టులో పిటిషన్ వేశారు.
అయితే ఎవరికైనా నిందితులకు నార్కో పరీక్షలు నిర్వహించాలంటే వారి అనుమతి తప్పనిసరి. తమ అంగీకారం లేకుండా నార్కో పరీక్షలు నిర్వహించకూడనది నిందితులు వాదించవచ్చు. నిబంధనలు కూడా వ్యక్తులు అంగీకరిస్తేనే నార్కో పరీక్షలు నిర్వహించాలన్న అంశం ఉంది. అందుకే గతంలో కొంత మందికి నార్కో పరీక్షలు నిర్వహించాలనుకున్నప్పటికీ వారు కోర్టు ఎదుట వ్యతిరేకత వ్యక్తం చేయడంతో కోర్టు అనుమతి రాలేదు. ఇప్పుడు శివశంకర్ రెడ్డి కూడా భిన్నంగా ఏమీ స్పందించని .. ఆయన కూడా నార్కో పరీక్షలకు వ్యతిరేకమని కోర్టుకు చెప్పే అవకాశం ఉంది.
అయితే నార్కో పరీక్షలు వద్దు అని చెబితే దేవిరెడ్డి శంకర్ రెడ్డితో పాటు అవినాష్ రెడ్డిపైనా అనుమానాలు పెరిగిపోతాయి. నిజాలు బయటకు వస్తాయనే వారు నార్కో పరీక్షలు వద్దంటున్నారని విమర్శలు వస్తాయి. అయితే ఈ విషయంలో ఏ చిన్న అవకాశాన్ని సీబీఐకి ఇవ్వకూడదన్న ఆలోచనలో .. దేవిరెడ్డి శంకర్ రెడ్డి వర్గం ఉంది. అందుకే విమర్శలు వచ్చినా.. అనుమానాలు వచ్చినా కొత్తవేం కాదు కాబట్టి.. నార్కో పరీక్షలకు దూరంగానే ఉండాలని నిర్ణయించుకున్నట్లుగా చెబుతున్నారు.