చంద్రబాబునాయుడు కుటుంబం కోసం ఇప్పుడు తగినంత సమయం కేటాయిస్తున్నారు. ఆయన కొత్త సంవత్సర వేడుకలను విదేశాల్లో కుటుంబంతో కలిసి జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇక్కడ ఉంటే పార్టీ నేతల హడావుడి ఉంటుందని.. ఆయన ఫ్యామిలీ విదేశాల్లో ప్రశాంతంగా గడపాలని అనుకున్నారు. ఆ మేరకు బయలుదేరి వెళ్లారు. అయితే తమకు చెప్పకుండా పోయారని వైఎస్ఆర్సీపీకి చెందిన జగన్ మీడియా ఫీల్ అవుతోంది. చంద్రబాబు ధాయ్ లాండ్కు వెళ్లారని అంత రహస్యం ఎందుకని కథనాలు వెలువరిస్తోంది.
వ్యక్తిగత పర్యటనకు పేపర్ యాడ్లు.. టీవీ ప్రకటనలు ఇచ్చి వెళ్లాలా అన్న సెటైర్లు సాక్షి మీడియాపై వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి లాగా విదేశీ పర్యటనకు వెళ్లాలంటే ప్రత్యేకంగా కోర్టులో ధరఖాస్తు చేసుకుని పాస్ పోర్టు తీసుకుని అందరికీ తెలిసేలా వెళ్లే పరిస్థితి చంద్రబాబుకు లేదని టీడీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. ఏపీ రాజకీయాల్లో కొంత కాలంగా ఓ దౌర్భగ్యమైన రాజకీయం ఉంది.
ఎవరైనా విదేశీ పర్యటనకు వెళ్తే వారు రహస్య కార్యకాలాపాల కోసం వెళ్తున్నారని ప్రచారం చేయడం కామన్ అయిపోయింది. చంద్రబాబుపై మొదటి నుంచి వైసీపీ వ్యూహం అదే. దాన్నే టీడీపీ నేతలు కూడా అంది పుచ్చుకున్నారు. ఆ ట్రెండ్ ఇంకా కొనసాగుతోంది. ఎవరు విదేశీ పర్యటనకు వెళ్లినా ఇతర పార్టీలు విమర్శలు .. అనుమానాలు వ్యక్తం చేయడం కామన్‌గా మారిపోయింది.