టీవీ9 నుంచి సీనియర్ జర్నలిస్ట్, న్యూస్ ప్రజెంటర్ మురళీకృష్ణ వెళ్లిపోయారు. తన నిర్ణయాన్ని ఆయన సోషల్ మీడియాలో ప్రటించారు. త్వరలో కొత్త చోట చేరుతానని కూడా ఆయన చెప్పారు. కొంత కాలంగా టీవీ9లో అగ్రస్థాయి జర్నలిస్టుల మధ్య ఈగో సమస్యలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. రవిప్రకాష్ తర్వాత కొత్త యాజమాన్యంమొత్తం బాధ్యతలు రజనీకాంత్‌కు ఇచ్చింది. అయితే.. తామంతా సీనియర్లమేనని ఇతరులు ఆయన మాటలను లెక్క చేయడం లేదు.
అదే సమయంలో రజనీకాంత్..రియల్ ఎస్టేట్ యజమానులైన ఓటర్ల మనసు గెల్చుకోవడంలో తనదైన వ్యూహాలు అవలంభించారు. దీంతో ఆయనకే సూపర్ పవర్స్ ఇచ్చారు. అప్పట్నుంచి మురళీకృష్ణ లాంటి సీనియర్ జర్నలిస్టులకు ఉక్కపోత ప్రారంభమైంది. అటూ ఇటూ కాని టైంలో డిస్కషన్ కార్యక్రమాలు పెట్టడం.. పెద్దగా ఎక్కడా జోక్యంచేసుకోకుండా చేస్తూండటంతో ఆయన అసంతృప్తికి గురయ్యారు. ఇప్పుడు ఎన్టీవీ లో అవకాశం చూసుకుని అక్కడ చేరిపోవాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. ఎన్టీవీలో చర్చా కార్యక్రమాలు నిర్వహించే ఓ గుర్తింపు ఉన్న యాంకర్ కోసం చాలా రోజులుగా ఆ చానల్ ఎదురు చూస్తోంది.
ఆ బాధ్యతను మురళీకృష్ణ భర్తీ చేస్తారని భావిస్తున్నారు. ఆయన చేరిక కొత్త ఏడాదిలో ఉండవచ్చని ఎన్టీవీ వర్గాలు చెబుతున్నాయి. గతంలో మురళీ కృష్ణ టీవీ9ను ఓ సారి వదిలి పెట్టి సాక్షిలో చేరారు. అక్కడ ఇమడలేక మళ్లీ టీవీ9కు వెళ్లిపోయారు. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు టీవీ9 తరపున వైఎస్ ప్రతినిధిగా మురళీకృష్ణ ఉంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
Dear all one #BIGNEWS Tv9 కి నేను రాజీనామా చేశాను. ఈ రోజే official గా రిలీవింగ్ లెటర్ తీసుకున్నా. తదుపరి ప్రయాణం త్వరలో… pic.twitter.com/J7IRTrMH4K
— Murali Krishna TV9 (@encounterwithmk) December 29, 2021