వైసీపీ ప్రభుత్వంపై వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనాాయణరెడ్డికి మరోసారి కోపం వచ్చింది. ఈ సారి పోలీసుల్ని కారణంగా చూపించి ఆయన ప్రభుత్వంపై దుమ్మెత్తి పోసారు. పోలీసులు మాఫియాతో చేతులు కలిపారని మండిపడ్డారు. నక్సలిజం.. టెర్రరిజం తగ్గిందని ఇక లోకల్ మాఫియాలు పోవాల్సి ఉందన్నారు. లోకల్ మాఫియాలతో పోలీసులు చేతులు కలిపారని.. అలా చేయడం వల్ల సామాన్యులకు భద్రత లేకుండా పోయిందన్నారు. ఈ మాఫియాలు ఎక్కడో లేవని ప్రభుత్వంలోనే ఉన్నాయన్నారు.
పోలీసు వ్యవస్థను బలోపేతం చేయాలంటే.. కలుపు మొక్కలను తొలగించాలని ఆయన సలహా ఇచ్చారు. ఆనం రామనారాయణ రెడ్డి కొంత కాలంగా వైసీపీ ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్నారు. ఆయనను వైసీపీ హైకమాండ్ దాదాపుగా పక్కన పెట్టేసింది. వెంకటగిరిలో నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి కుమారుడు రామ్ కుమార్ రెడ్డిని ప్రోత్సహిస్తోంది. మరో వైపు నెల్లూరు సిటీ, రూరల్లో ఖాళీ లేదు.
వచ్చే ఎన్నికల నాటికి ఆనంను ఒంటరిని చేస్తారని.. ప్రచారం జరుగుతోంది. దీంతో ఆనం ముందు జాగ్రత్తగా తన రెబలిజంను చూపిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. గతంలో ఓ సారి ఆనం ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు సస్పెండ్ చేసేందుకు జగన్ సిద్ధమయ్యారన్న లీకులు ఇచ్చారు. కానీ తర్వాత వెనక్కి తగ్గారు. ఇప్పుుడ ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది.