శర్వానంద్ లేటెస్ట్ మూవీ ‘ఒకే ఒక జీవితం’. శ్రీ కార్తిక్ దర్శకుడు. రీతూ వర్మ కథానాయిక. అమల అక్కినేని, వెన్నెల కిషోర్, ప్రియదర్శికీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో వున్న ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. నాజర్ వాయిస్ ఓవర్ తో మొదలైన టీజర్ లో సినిమా కాన్సెప్ట్ రివిల్ చేశారు. ఇదో టైం ట్రావెల్ కథ. భవిష్యత్ నుంచి మనసులు గతంలోకి వెళితే ఎలా వుంటుందనే పాయింట్ ఇచ్నిమ సినిమాగా మలిచారు.
టీజర్ మొత్తానికి కాన్సెప్ట్ ని అర్ధం చేయడం కోసమే కట్ చేసినట్లుగా అనిపించింది. ఓ ముగ్గురు భవిష్యత్ నుంచి గతంఆలో వస్తే ఎలా వుంటుంది ? టైం మిషన్ లో ఒకసారి మాత్రమే ప్రయాణించే అవకాశం వుంటే ఎలాంటి పరిస్థితి ఎదురౌతుంది ? ఇలాంటి పాయింట్లు చుట్టూ నడిచే కథ ఇది. అమల కనిపించిన ఫ్రేములో మదర్ సెంటిమెంట్ కూడా వుంది. ముగ్గురు యువకులు పిల్లలుగా మారిపోవడం, వాషింగ్ పౌడర్ నిర్మ వింటేజ్ యాడ్ .. టీజర్ లో కొసమెరుపు. ఈ సినిమాకి జేక్స్ బిజోయ్ మ్యూజిక్. ఎస్.ఆర్.ప్రకాష్ బాబు, ఎస్.ఆర్ ప్రభు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 2022 ప్రథమార్ధంలో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.