ఏపీ ప్రభుత్వంలోలానే టీటీడీలోనూ సలహాదారుల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోతోంది. తాజాగా అమరా నాగారం అనే వ్యక్తిని ఐటీ సలహాదారుగా నియమిస్తూ టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి నియామకపత్రాలు ఇచ్చారు. టీటీడీ వర్గాలు ఆయనను ప్రముఖ ఈ కామర్స్ బ్రాండ్ మింత్రా సీఈవోగా గొప్పగా చెప్పారు. ఆయితే అమర్ నాగారంను మింత్రా సీఈవోగా తప్పించారు. ఈ రోజే అంటే డిసెంబర్ 31నే ఆయనకు మింత్రాలో చివరిరోజు. చివరిరోజునే ఆయనను టీటీడీ ఐటీ అడ్వైడర్గా పదవి ఇచ్చారు.
మింత్రా ఫ్లిప్ కార్ట్ గ్రూపులో భాగం. ఫ్లిప్ కార్ట్‌ను వాల్ మార్ట్ కైవసం చేసుకున్న తర్వాత సీఈవోగా వచ్చిన కల్యాణ్ కృష్ణమూర్తి. పలుమార్పులు చేపడుతున్నారు. ఈ క్రమంలో గతంలో తమగ్రూప్లో భాగమైన మింత్రా సీఈవోను కూడా అసలు ఫ్లిప్ కార్ట్ నుంచే బయటకు పంపాలని నిర్ణయించుకున్నారు. అయితే ఆయనకు టీటీడీలో ఎలా సలహాదారు పదవి వచ్చిందన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇటీవలే కృష్ణమూర్తి సీఎం జగన్‌తో భేటీ కావడం విశేషం.
అమర్ నగరం స్వచ్చందంగా సేవలందిస్తారా లేక ఆయనకు టీటీడీ తరపున ఏమైనా జీతభత్యాలు ఇస్తారా అన్నదాని ఇంకాఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు. అమర్ నగారం … టీటీడీకి ఐటీ సలహాదారుగా ఎలాంటి సేవలు అందిస్తారో స్పష్టత లేదు. ఐటీ అడ్వయిజర్‌గా ఈ కామర్స్ ఇం స్ట్రీలో ప్రముఖ వ్యక్తిని నియమించడంతో టీటీడీ భవిష్యత్‌లో భక్తులకు ఆన్ లైన్ సేవలను మరింత విస్తరించే దిశగా కసరత్తు చేస్తుందనే అభిప్రాయం వినిపిస్తోంది.