తెలంగాణలో సినిమా టిక్కెట్ రేటెక్కువ.. బస్సు టికెట్ తక్కువ..! ఏపీలో రివర్స్ ..

ఏపీఆర్టీసీ ఆదాయాన్ని తెలంగాణ ఆర్టీసీ చాలా ప్లాన్డ్‌గా కైవసం చేసుకుంటోంది. ఏపీ అధికారుల మూర్ఖత్వమే దీనికి కారణం. ప్రజలకు ఇష్టమైతే వెళ్తారు.. లేకపోతే లేదనే సినిమా టిక్కెట్ల విషయంలో రచ్చచేస్తున్న ఏపీ సర్కార్.. పండుగలకు తప్పనిసరిగా ప్రయాణాలు చేసే ప్రజలపై మాత్రం దోపిడికీ పాల్పడుతోంది. యాభై శాతం రేట్లు పెంచాలని నిర్ణయించుకుంది. అయితే.. తెలంగాణ ఆర్టీసీ మాత్రం ఈ విషయంలో పెద్ద పెద్ద మాటలు చెప్పకుండా వ్యాపార ప్రయోజనాలను చూసుకుంటోంది.

హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లే బస్సుల్లో యాభై శాతం అదనపు చార్జీని వసూలు చేయకూడదని నిర్ణయం తీసుకుంటున్నారు. అదే సమయంలో ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెషల్ బస్సుల్లో టిక్కెట్ రేట్లను యాభై శాతానికి పెంచారు. దీంతో ఆ బస్సుల ప్రయాణికుల్ని తమ వైపు రప్పించాలంటే టిక్కెట్ రేట్ల తగ్గింపే మార్గం అనుకుని ప్రత్యేక బస్సుల్లో యాభై శాతం అదనపు చార్జీని రద్దు చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఏపీ బస్సులు ఖాళీగా వెళ్తాయి. తెలంగాణ బస్సులు ఫుల్‌గా వెళ్తాయి.

ఈ కాన్సెప్ట్‌ను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అక్టోబర్‌లో దసరా పండుగ సందర్భంగా అమలు చేశారు. అప్పుడు ఏపీ ఆర్టీసీ బస్సుల్లో టిక్కెట్లు బుక్ చేసుకున్న వారు కూడా క్యాన్సిల్ చేసుకుని.. తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లోటిక్కెట్లు బుక్ చేసుకున్నారు. దీంతో అనూహ్యంగా ఆదాయం పెరిగింది. యాభై శాతం పెంచితే చాలా వరకు టిక్కెట్లు ఖాళీగా ఉంటున్నాయి. ఇటీవల ఏపీ, టీఎస్ ఆర్టీసీల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఏపీ నుంచి ఎన్ని బస్సులు తెలంగాణకు వస్తే .. తెలంగాణ కూడా అన్ని బస్సులను ఏపీకి నడుపుకోవచ్చు.

గతంలో ఏపీ ఆర్టీసీ బస్సులే విజయవాడకు 90 శాతం వెళ్లేవి. ఇప్పుడు యాభై శాతం అయ్యాయి. మిగిలిన యాభై శాతం టీఎస్ఆర్టీసీ బస్సులు వెళ్తున్నారు. ప్రత్యేక బస్సుల్లోనూ ఇదే కోటా. ఏపీ ఆర్టీసీ రేటు పెంచినా తెలంగాణ పెంచకుండా ఆ రద్దీని తాను క్యాష్ చేసుకోవాలని ప్రయత్నించడం ప్రారంభించింది. ఏపీ ఆర్టీసీకి మాత్రం ఇవేం పట్టింపు లేదు. రేటు తగ్గించేది లేదని చెబుతోంది. సినిమా టిక్కెట్లతో పోల్చి నెటిజన్లు విమర్శలు చేస్తున్నా.. పట్టించుకునేవారే లేరు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మారుతికి ముందే తెలుసా?

రాజ్ తరుణ్ కి హ్యాట్రిక్ ఫ్లాపులు పడ్డాయి. రెండు నెలల వ్యవధిలో మూడు సినిమాలు రాజ్ నుంచి వచ్చాయి. పురుషోత్తముడు, తిరగబడరాస్వామి, భలే ఉన్నాడే. ఈ మూడు ఫ్లాపులే. భలే ఉన్నాడే చాలా...

బంగ్లాని లైట్ తీసుకోవద్దు బాసూ

ఇండియా - బంగ్లాదేశ్‌ టెస్ట్ సిరీస్ ఈనెల‌ 19 నుంచి ప్రారంభం కానుంది. డబ్ల్యూటీసీ 2023-25 సీజన్‌లో రాబోయే పది టెస్టులు టీమ్‌ఇండియాకు అత్యంత కీలకం. అందుకే ఈ సిరీస్ ప్రాధాన్యతని సంతరించుకుంది....

చిట్‌చాట్‌లతో BRSను చిరాకు పెడుతున్న రేవంత్ !

రేవంత్ రెడ్డి మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడే మాటలు మీడియాలో హైలెట్ అవుతూంటాయి. వాటిని పట్టుకుని బీఆర్ఎస్ ఆవేశ పడుతోంది . అంతా అయిపోయిన తరవాత తీరిగ్గా.. నేను ఎప్పుడన్నాను అని రేవంత్...

ఢిల్లీ తర్వాత సీఎం కూడా కేజ్రీవాలే ?

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మంగళవారం రాజీనామా చేయబోతున్నారు. అదే రోజు ఢిల్లీ శాసనసభాపక్ష సమావేశం కూడా నిర్వహిస్తున్నారు. కొత్త సీఎంగా కేజ్రీవాల్ ఎవరికి చాన్సిస్తారన్నది హాట్ టాపిక్ గా మారింది. విచిత్రంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close