బంగార్రాజుకి అదొక్క‌టే బాధ‌

ఆర్‌.ఆర్‌.ఆర్‌.. వాయిదా ప‌డ‌డంతో బంగార్రాజుకి దారులు తెర‌చుకున్నాయి. ఈ సంక్రాంతికి రావాలా? వ‌ద్దా? అనే డైలామాలో ఉన్న బంగార్రాజు.. ఆర్‌.ఆర్‌.ఆర్ వాయిదా ప‌డ‌డంతో ఇక ఎలాంటి అడ్డూ లేకుండా పోయింది. ఈరోజే బంగార్రాజు టీజ‌ర్ విడుద‌లైంది. సంక్రాంతికి సిద్ధ‌మంటూ ప్ర‌క‌టించింది. అయితే.. డేట్ మాత్రం క్లారిటీ లేదు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్త‌య్యింది. సంక్రాంతికి రావాల‌న్న ఉద్దేశ్యంతోనే ఆఘ‌మేఘాల మీద పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు చేయిస్తున్నారు. కాక‌పోతే… ఒక్క‌టే ఇబ్బంది. ఈ సినిమాలో సీజీ వ‌ర్క్ చాలా పెండింగ్ లో ఉన్నాయి. అది ఎప్ప‌టికి పూర్త‌వుతుంద‌న్న విష‌యంలో క్లారిటీ లేదు. అయిన‌ప్ప‌టికీ… రెండు మూడు స్టూడియోలో 24 గంట‌ల పాటూ శ్ర‌మిస్తూ సీజీ వ‌ర్క్ ని పూర్తి చేస్తున్నారు. అయితే ఈ సినిమాకి సీజీ చాలా ముఖ్యం. ఆయా స‌న్నివేశాలు స‌రిగా రాక‌పోతే… నెగిటీవ్ మార్క్ ప‌డే ప్ర‌మాదం ఉంది. సీజీకి టైమ్ ప‌డుతుంద‌ని చిత్ర‌బృందానికి ముందే తెలుసు. అందుకే సంక్రాంతికి రావాలా వ‌ద్దా? అంటూ ఊగిస‌లాడింది. ఆర్‌.ఆర్‌.ఆర్‌, రాధే శ్యామ్ లాంటి పెద్ద సినిమాల మ‌ధ్య ఎందుకు? అనే ఆలోచ‌న‌లో ఉన్నా.. స‌డ‌న్ గా ఆర్‌.ఆర్‌.ఆర్ వాయిదా ప‌డడంతో.. బంగార్రాజు సీజీ ప‌నులు మ‌రింత వేగంగా జ‌రిపిస్తున్నారు. ఒక‌ట్రెండు రోజుల్లో.. సీజీ ప‌నుల‌పై ఓ క్లారిటీ వ‌స్తుంది. ఆ త‌ర‌వాతే రిలీజ్‌డేట్ ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది. ఈలోగా ప్ర‌మోష‌న్ల‌ను జోరుగా చేయాల‌ని చూస్తోంది. జ‌న‌వ‌రి 15న ఈ సినిమా విడుద‌ల‌య్యే ఛాన్సుంది. సీజీ పూర్త‌యిపోతే.. జ‌న‌వ‌రి 12నే రావొచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డి-ఏజింగ్… లాభమా? నష్టమా ?

సినిమాలో ఒక క్యారెక్టర్ బాల్యం, యవ్వనం, కౌమార, ప్రౌడ దశలని చూపించడం ఫిల్మ్ మేకర్స్ కి పెద్ద సవాల్. ఇందుకోసం హలీవుడ్ నుంచి కూడా మేకప్ మ్యాన్ లని దిగుమతి చేసుకునే వారు....

దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో దివ్వెల మాధురీ !

దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో కొత్త కొత్త ఎపిసోడ్లు ప్రారంభమవుతున్నాయి. కొద్ది రోజుల పాటు సైలెంట్ గా ఉంటానని చెప్పిన దివ్వెల మాధురీ.. ఒక్క సారిగా.. ఏకంగా దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోనే ప్రత్యక్షమయ్యారు. దువ్వాడ...

ఆ పడవలు నందిగం సురేష్ తాలూకానే !

ప్రకాశం బ్యారేజీకి వరద వస్తే ఈ మధ్య బోట్లు కొట్టుకు వస్తున్నాయి. బ్యారేజని డ్యామేజ్ చేస్తున్నాయి. అవి ఎలా వస్తున్నాయో తెలియడం లేదు. ఇప్పుడు మిస్టరీ బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ రంగులేసిన...

శభాష్ నిమ్మల… అభినందించిన నారా లోకేష్

భారీ వర్షానికి తోడు బుడమేరకు పడిన గండ్లు విజయవాడను ముంచేత్తాయి. కనీవినీ ఎరుగని స్థాయిలో వరద పోటెత్తడంతో విజయవాడ గత ఆరు రోజులుగా వరదలో నానుతోంది. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చితేనే విజయవాడకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close