తెలంగాణలో ఓ భిన్నమైన రాజకీయ వాతావరణం కనిపిస్తోంది. గత రెండున్నరేళ్లుగా ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తున్న రాజకీయం కనిపిస్తోంది. ప్రభుత్వాలపై వ్యతిరేక విమర్శలు చేసే సోషల్ మీడియా ఇన్ఫ్లూయన్సర్లను ఎడా పెడా అరెస్ట్ చేస్తున్నారు. అదే అధికార పార్టీకి చెందిన వారు ఎన్ని ఆకృత్యాలకు పాల్పడినా వారిపై జాలి, దయ చూపిస్తున్నారు. తెలంగాణలో గత మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే జర్నలిస్టుల్ని టార్గెట్ చేశారు. పలు కేసులు నమోదు చేశారు. కాళోజీ టీవీ పేరుతో కొంత మంది ఔత్సాహిక జర్నలిస్టులు మీడియాను నడుపుతున్నారు.
ప్రభుత్వంపై విమర్శలు చేయడంలో వీరు ఎప్పుడూ భయపడలేదు. హఠాత్తుగా అందర్నీ పోలీసులు అరెస్ట్ చేసి తీసకెళ్లిపోయారు. అలాగే ఒక వెబ్ సైట్, చానల్ జర్నలిస్టులకూ అదే పరిస్థితి. సోషల్ మీడియాలో వీరు చేస్తున్న వ్యతిరేక ప్రచారం ఎక్కువగా ఉందని ప్రభుత్వం భావించిందేమో కానీ వెంటనే అరెస్టులు చేసి తీసుకెళ్లిపోయింది. అయితే అదే సమయంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు రాఘవేంద్ర వ్యవహారంలో పోలీసుల తీరు మాత్రం వివాదాస్పంద అవుతోంది.
ఆయన చేసిన నేరాలు.. ఘోరాలు అన్నీ బయటకు వచ్చినా పోలీసులు అరెస్ట్ చూపిచలేకపోయారు. ఆయనను హైదరాబాద్ ప్రెస్ క్లబ్ వద్ద అదుపులోకి తీసుకున్నారని ముందుగా పోలీసులకు లీక్ ఇచ్చారు. సాయంత్రం వరకూ అలా ప్రచారం చేయించుకుని … తీరిగ్గా రాత్రి .. తూచ్ అనే శారు. అంటే వమమా రాఘవేంద్రను అరెస్ట్ చేయలేదన్నమాట. తెలంగాణ పోలీసుల తీరు చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. అధికారం ఉంటే చట్టాలను ఎలాగైనా వర్తింపు చేసుకోవచ్చని చూపిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నారు.