తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పుడు కమ్యూనిస్టు పార్టీలతో సన్నిహితం అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. కొద్ది రోజులుగా అంతర్గతంగా వారితో చర్చలుజరుపుతున్నారు. హఠాత్తుగా కేరళ సీఎం పినరయి విజయన్ను ప్రగతి భవన్‌కు పిలిచి విందు ఏర్పాటు చేశారు. శుక్రవారమే జరగాల్సి ఉన్నా.. వివిధ కారణాలతో వాయిదా పడింది.శనివారం పినరయి విజయన్‌తో పాటు పలువురు కమ్యూనిస్టు పార్టీల నేతలో ప్రగతి భవన్లో కేసీఆర్ సమావేశం అయినట్లుగా తెలుస్తోంది.
జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక విధానాన్ని అనుసరించాలని నిర్ణయించుకున్న కేసీఆర్.. ఆ పార్టీపై ఎటాక్‌ను ముమ్మరం చేశారు. తెలంగాణ ఆ పార్టీ నేతల్ని తన అధికార బలంతో టార్గెట్ చేశారు. ఈ క్రమంలో జాతీయ స్థాయిలో బీజేపీయేతర పార్టీలతోనూ సంప్రదింపులు జరుపుతున్నారు. ఇటీవల తమిళనాడు వెళ్లి స్టాలిన్‌ను కలిశారు. అది కూడా బీజేపీయేతర కూటమికోసమేనని ప్రచారం జరిగింది. తాజాగా కమ్యూనిస్టులతో మంతనాలు జరుపుతున్నారు.
తెలంగాణలోనూ కమ్యూనిస్టులతో కేసీఆర్ దగ్గరగా ఉంటున్నారు. ఇటీవల ఖమ్మం జిల్లాలో జరిగిన మున్సిపల్, ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు లెఫ్ట్ పార్టీలు మద్దతు ప్రకటించాయి. హుజురాబాద్‌లోనూ టీఆర్ఎస్కే మద్దతు లభించింది. ఈ క్రమంలో తెలంగాణలో కాంగ్రెస్ కన్నా టీఆర్ఎస్ వైపే లెఫ్ట్ మొగ్గు చూపుతోంది. మొత్తంగా కేసీఆర్ ప్రణాళికాబద్దమైన వ్యూహంతోనే అడుగులు ముందుకు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.