శ్రీశైలం నియోజకవర్గంలో తరచూ ఓ వర్గంపై వివాదాలు రేపడం కామన్‌గా మారిపోయింది. ఆలయంలో వారి ఆధిపత్యమే ఉందంటూ గతంలో బీజేపీ నేతలు చేసిన హడావుడి అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు అదే నియోజకవర్గంలోని ఆత్మకూరులో జరిగిన గొడవ మరోసారి చర్చనీయాంశం అవుతోంది.ప్రైవేటు స్థలంలోఓ వర్గం వారు తమ ప్రార్థనా మందిరం కట్టుకుంటూంటే అడ్డంకులు కల్పిస్తున్నారని వారు చెలరేగిపోయారు. అడ్డుకోవడానికి వచ్చిన ఓ పార్టీనేతతో పాటు పోలీసుల్నీ తరిమి కొట్టారు. బీజేపీ నేత దొరికితే చంపేసి ఉండేవారేమో. ఆయన కారును ధ్వంసం చేశారు.
ఈ ఘటన ఏపీ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వెంటనే డీజీపీ కూడా స్పందించి ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. మత విద్వేషాను కఠినంగా అణిచి వేస్తామని చెప్పుకొచ్చారు. కానీ ఇలాంటి పరిస్థితి ఎందుకు ఏర్పడింది అన్న అంశంపై ఆయన మరింత లోతుగా ఆలోచించినట్లుగా లేరు. పోలీస్ స్టేషన్‌ను చుట్టుముట్టి దాడులు చేసినా రక్షించుకోలేని స్థితిలో పోలీసులు ఉన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు.. పోలీసుల తీరు.. ప్రజల్లో పోలీసుల విషయంలో తగ్గిపోతున్న భయభక్తులు లాంటి వాటి పరిస్థితిని తెలియచెప్పడానికి ఇలాంటి ఘటనలు సాక్ష్యాలుగా కనిపిస్తూ ఉంటాయి
టీడీపీ హయాంలో పాత గుంటూరు పోలీస్ స్టేషన్‌పై ఓ వర్గం దాడి చేసి పోలీసుల్ని సైతం కొట్టిన ఘటన సంచలనం సృష్టించింది. ఆ తర్వాత పోలీసులకు ఏ మాత్రం ఫీల్ అవకుండా ప్రభుత్వం చెప్పిందని కేసుల్ని ఎత్తేయడానికి ప్రయత్నించారు. ఈ కేసు ప్రస్తుతం హైకోర్టులో ఉంది.. అది వేరే విషయం. ఇప్పుడు కర్నూలు జిల్లా ఆత్మకూరులో అదే తరహా ఘటన జరిగింది. రాజకీయాల కోసం ప్రజల బతుకుల్ని పణంగా పెట్టే రాజకీయనేతలు ఉన్నంత కాలం… పోలీసులు వారి నీడలో విధులు నిర్వహిస్తున్నంత కాలం ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి.