టీవీ5ని కూడా బ్యాన్ చేస్తున్నట్లుగా వైసీపీ ప్రకటింది. అయితే టీవీ5 అంటే ఒకప్పుడు వైసీపీకి సపోర్ట్ చానల్. జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆత్మీయమైన మీడియా సంస్థగా పేరు తెచ్చుకుంది. ఎంత సపోర్టివ్‌గా ఉండేదంటే… ఒకసారి వైఎస్ హెలికాఫ్టర్ ప్రమాదంలో రిలయన్స్ ప్రమేయం అని ముద్ర వేసి.. రిలయన్స్ ఆస్తులపై దాడులకు ప్రణాళిక రెడీచేశారు. ఆ ప్లాన్ అమలు చేయడంలో టీవీ5ది కీలక పాత్ర. ఫేక్ వార్త అని తెలిసినా .. ఓ ఊరూపేరూలేని వెబ్సైట్లో వచ్చిన వార్తను బ్రేకింగ్‌ల పేరుతో ప్రస్తుతం ఏబీఎన్‌లో ఉన్న వెంకటకృష్ణతో షో నడిపించారు.
ఆ తర్వాత జగన్‌కు సపోర్టుగా ఉన్న మీడియా అందుకుంది. ఇక దాడులు సంగతి చెప్పాల్సిన పని లేదు. తెలంగాణ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి దాడులకు నేతృత్వం వహించారు. అప్పుడు జగన్ఏం చేసినా టీవీ 5లో వచ్చేంత కవరేజీ ఏ చానల్లోనూ వచ్చేది కాదు. అంత వరకూ ఎందుకు.., టీవీ5 సైడ్ బిజినెస్‌గా నూజెన్ అయిల్ అమ్మేవారు. అది మొదట్లో బాగా క్లిక్ అయింది. ఆ వ్యాపారానికి వైఎస్ క్యాంప్ నుంచి సహకారం ఉందని చెప్పుకునేవారు. ఏమయిందో ఏమో కానీ హఠాత్తుగా టీవీ 5 వైసీపీకి వ్యతిరేకం అయింది. ఆ పార్టీకి వ్యతిరేకంగా దుమ్మెత్తిపోస్తోంది.
కేసులు పెట్టి.. భయపెట్టి చానల్‌ను కంట్రోల్లోకి తెచ్చుకుందామనుకున్నారు కానీ సాధ్యం కాలేదు. టీవీ 5 ఇంకా ఇంకా రెచ్చిపోతోంది. అదే సమయంలో జగన్‌కు సపోర్ట్ గా ఉండే ఎన్టీవీ మాత్రం తన స్టాండ్ మార్చుకోలేదు. అప్పట్లోలానే టీడీపీపై వైసీపీ అవసరాలకు తగ్గట్లుగా బురద చల్లడం .. వైసీపీని నెత్తికెక్కించుకోవడం వంటివి చేస్తూనే ఉంది. కనీ టీవీ5 మాత్రమే మారిపోయింది. అలా ఎందుకు మారిపోయిదంనేది.. అటు వైసీపీ పెద్దలకు.. ఇటు టీవీ యజమానులకు మాత్రమే తెలుసు.