శ్రీలంకకు చెందిన బాలీవడ్ హీరోయిన్ జాక్వలైన్ ఫెర్నాండెజ్ .. ఇండియాలో కష్టాల్లో ఇరుక్కుపోయారు. బాలీవుడ్లో చాన్సులు వస్తున్నాయని ..కెరీర్ నిలదొక్కకుంటోందని అనుకుంటున్న సమయంలోనే సుఖేష్ చంద్రశేఖర్ అనేవ్యక్తితో రిలేషన్ షిప్‌లోకి వెళ్లారు. అతనో పెద్ద ఫ్రాడ్ అని తేలింది. ఇప్పుడు ఆయన జైల్లో ఉన్నారు. ఆయన చేసిన మనీలాండరింగ్ కేసులు ఇప్పుడు జాక్వలైన్‌కు చుట్టుకుంటున్నాయి.
ఆమెను ఈడీ రెండు, మూడు సార్లు పిలిచి ప్రశ్నించింది. మరో హీరోయిన్ నోరా ఫతేహి కూడా సుఖేష్ నుంచి బహుమతులుఅందుకోవడంతో ఆమెనూ పిలిచారు. కానీ జాక్వలైన్ సుఖేష్‌తో రిలేషన్లో ఉండటంతో ఎక్కువ ఇబ్బంది పడుతోంది. వారి ప్రైవేటు ఫోటోలు ఇప్పుడు బయటకు వచ్చాయి. ఎలా వచ్చాయో తెలియదు కానీ ఆ ఫోటోలను చూసి ఆమె షాక్‌కు గురవుతోంది. ఇక చేసేదేమీ లేదని.. నెటిజన్లనే కోరుతోంది. అవి మీ కుటుంబసభ్యుల ఫోటోలుగా భావించి ఎవరికీ షేర్ చేయవద్దని విజ్ఞప్తి చేస్తోంది.
కానీ ఇక్కడ అంటే సోషల్ మీడియాలో ఇలాంటి సెంటిమెంట్లు పని చేయవని జాక్వలైన్‌కు తెలియదా అని.. ఆమె అలా చెప్పినతర్వాతే విస్తృతంగా మీడియాలో సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతున్న ఫోటోలే నిదర్శనంగా కనిపిస్తున్నాయి. ఆ ఫోటోలు అయితే ఆమె లీక్ చేయాలి.. లేకపోతే సుఖేష్ లీక్ చేయాలి. కానీ సుఖేష్ జైల్లో ఉన్నాడు. లీక్ చేయలేరు.ఆయనకు సంబంధించిన వస్తువులు పోలీసుల దగ్గర ఉంటాయి కాబట్టి వారే లీక్ చేసి ఉంటారనే అనుమానాలున్నాయి. ఎవరు లీక్ చేసినా జాక్వలైన్ మాత్రం మానసికంగా శిక్ష అనుభవించేస్తున్నారు.