రమేష్ బాబు చాలా కాలంగా సినిమా వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన నిర్మాతగా కూడా సినిమాలేం చేయట్లేదు. కనీసం సినిమా ఫంక్షన్లలోనూ పాలు పంచుకోవడం లేదు. రమేష్ ఎందుకు మీడియాకు దూరంగా ఉండేవారు అనేది ఆ రోజుల్లో పెద్ద ప్రశ్న. నిర్మాత గా ఆర్ధిక నష్టాలు కొంత వరకు ఆయన ముభావంగా ఉండడానికి కారణం
అది అలా ఉండగా హీరో మహేష్ కి అన్నయ్యంటే ప్రాణం. తనని ఓ పెద్ద నిర్మాతగా చూడాలనుకున్నాడు. కానీ కుదర్లేదు. అయితే తన ప్రతీ సినిమాలోనూ రమేష్‌కి పరోక్షంగా వాటా ఉండేది. ఓ సినిమా ఒప్పుకుంటే, పారితోషికం తీసుకుంటే, అందులో కొంత భాగం రమేష్ కి పంపేవార్ట అభిమానంతో. సినిమాకి కనీసం రూ.2 కోట్ల వరకూ రమేష్ వాటాగా వెళ్లిపోయేదని తెలుస్తోంది. సర్కారు వారి పాట సినిమా కికూడా రమేష్ వాటాగా రూ.2 కోట్లు వెళ్లాయని సన్నిహితులు చెబుతున్నారు. అదీ… మహేష్, తన సోదరుడికి ఇచ్చే స్థానం. అయితే… ఇప్పుడు రమేష్ అంత్యక్రియల్లో పాల్గొనే అవకాశం కూడా మహేష్‌కి లేకుండా పోయింది. మహేష్ లేకుండానే రమేష్ అంత్యక్రియలు జరిగిపోయాయి.