ప్రభాస్, నాగ్ అశ్విన్ కలయికలో తెరకెక్కునున్న పాన్ ఇండియా మూవీ ప్రాజెక్ట్ కే. బాహుబలి కంటే భారీ స్థాయిలో తీయాలనే ఆలోచనలో వున్నారు నిర్మాతలు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అయితే ఇప్పుడీ సినిమాకి బాలీవుడ్ నుంచి ఓ చిక్కొచ్చి పడింది. రన్బీర్ కపూర్ హీరో తెరకెక్కుతున్న సూపర్ హీరో మూవీ బ్రహ్మాస్త్ర. బాలీవుడ్ చరిత్రలో అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాని మూడు పార్టులుగా ప్లాన్ చేశారు. తెలుగులో ఈ సినిమాని రాజమౌళి విడుదల చేస్తున్నారు.
విషయం ఏమిటంటే బ్రహ్మాస్త్ర కథ, ప్రభాస్ ప్రాజెక్ట్ కే కథ దాదాపు ఒక్కటేనని తెలిసింది. కొన్ని దశాబ్దాలు కిందట హిమాళయ పర్వత శ్రేణుల్లో ఒక ఆయుధాన్ని దాచివుంచుతారు. ఆ ఆయుధం కోసం జరిగే పోరాటమే బ్రహ్మాస్త్ర. ప్రభాస్ ప్రాజెక్ట్ కే కథకి మూలం కూడా ఇదే పాయింట్ ని తెలిసింది. అదే ఆయుధం, అవే హిమాళయాలు నేపధ్యంలోనే ప్రాజెక్ట్ కే వుంటుందని భోగట్టా. బ్రహ్మాస్త్ర షూటింగ్ సగం జరిగిపోయింది. ఇప్పుడు వాళ్ళు కథ మార్చరు. నాగ్ అశ్విన్ ఇంకా సెట్స్ మీదకి వెళ్ళలేదు. ప్రస్తుతం కథ మార్పులు కోసం చర్చలు జరుగుతున్నాయి. కుదిరితే బ్రహ్మాస్త్ర టీంతో కూర్చుని సిమిలారిటీస్ ని చర్చించుకొని ప్రాజెక్ట్ కే లో మార్పులు చేయాలనే ఆలోచనలో వున్నారు. ఏదేమైనా ముందుగా ఇలాంటి విషయాలు క్లియర్ చేసుకుంటే మంచిది. అయితే కొన్ని పోలికలు వుంటే మార్పులు చేసుకోవచ్చు కానీ మూలకథ మొత్తం ఒకేలా వుంటే మాత్రం ప్రాజెక్ట్ కె మూలకథలో కూడా సమూల మార్పులు చేయాల్సివుంటుంది.