ఏపీ ప్రభుత్వం ఎంత వేధించినా భరిస్తున్న సినిమా వాళ్లంటే వైసీపీ నేతలకు అలుసైపోయింది. టాలీవుడ్ అంటే ఎంత చులకన అయిపోయిందంటే.. చివరికి వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి.. నేరుగా సినిమా వాళ్లు బలిసికొట్టుకుంటున్నారంటూ విమర్శించేశారు. ఇంత గా ఎందుకు తిట్టాల్సి వచ్చిందో అసలు టాలీవుడ్… కోవూరు ఎమ్మెల్యేకు ఏంటి సంబంధమో ఎవరికీ తెలియదు. కానీ వైసీపీ ఎమ్మెల్యే కాబట్టి ఎవర్నైనా.. ఎలాగైనా తిట్టవచ్చనే హక్కు ఉందని ఆయన పీలయ్యాడు. ఉపయోగించుకున్నారు.
అసలు సినిమా వారికి ఏపీ అంటే గుర్తుందా? … టిక్కెట్ రేట్లు తగ్గిస్తే సామాన్యులు కూడా సినిమాలు చూస్తారని, ప్రభుత్వ నిర్ణయంలో తప్పేంటని ఆయన ఎదురుదాడి చేస్తున్నారు. నల్లపురెడ్డి కొద్ది రోజుల కిందట… ఏపీలో వరదలు వస్తే సినీ హీరోలు విరాళాలు ప్రకటించలేదని సినీ తారలను తిట్టారు. ఇప్పుడు మరోసారి టిక్కెట్ల అంశంపై తిట్టారు. టాలీవుడ్ అంటే ఇష్టారీతిన తిట్టినా పడి ఉంటారన్న భావనకు వైసీపీ ఎమ్మెల్యేలు వస్తున్నారు.
టాలీవుడ్లో ఐక్యత లేకపోవడంతో వల్ల..ఎవరికి వారు తమను కాదని అని దులిపేసుకుని వెళ్లిపోతున్నారు. చివరికి నాగార్జున లాంటి వారు టిక్కెట్ రేట్లతో తమకేమీ ఇబ్బంది లేదని చెప్పడం ద్వారా … టాలీవుడ్ ను మరింత పలుచన చేశారు. అలాంటి పరిస్థితులే ఉంటే ఇక నల్లపురెడ్డి లాంటి వారు ఇవాళ బలిసి కొట్టుకుంటున్నారని తిట్టారు.. రేపు ఇంకొకరు.. భరించలేని విధంగా తిడతారు. ఎందుకంటే టాలీవుడ్ అంత అలుసైపోయింది మరి .!