ప్రధాని మోడీకి పంజాబ్‌లో ఎదురైన ఘటనపై బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ తన అభిప్రాయాన్ని ట్వీట్ చేశారు. దీన్ని సెటైరిక్‌గా విమర్శిస్తూ హీరో సిద్ధార్థ్ చేసిన ట్వీట్ ఇప్పుడు వివాదాస్పదం వుతోంది. ఆమెను కాక్ చాంపియన్‌గా పేర్కొనడంతో సమస్య ప్రారంభమయింది. ఇది దారుణంగా ఉందని… ఓ మహిళ పట్ల ఇలాంటి పదాలు ఎలా వాడతారని నెటిజన్లు మండిపడుతున్నారు. ఇలాంటి వివాదాలొస్తే విరుచుకుపడటానికి ముందు ఉండే శ్రీపాద చిన్మయి కూడా సిద్ధార్థపై మండిపడ్డారు.
ఇక సైనా భర్త కశ్యప్ కూడా ఇది మంచి పద్దతి కాదని ట్వీట్ చేశారు. మరో వైపు ఈ వివాదంపై సిద్ధార్థ్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. డబుల్ మీనింగ్ ఎందుకు తీసుకుంటున్నారని.. తాను సింగిల్ మీనింగ్‌తోనే ఆ మాట పెట్టానని.. తనకు మద్దతుగా ఉండే కొన్ని కాక్ పదాలను ట్వీట్‌కు జోడించారు. మోడీని సమర్థిస్తూ సైనా పెట్టిన ట్వీట్‌ను విమర్శించారు కాబట్టి సహజంగానే బీజేపీ మద్దతుదారుల నుంచి సిద్ధార్థ్‌పై దాడి పెరిగింది. జాతీయ మహిళా కమిషన్ కేసు పెట్టాలని ముంబై పోలీసుల్ని ఆదేశించింది.
సిద్ధార్థ్ ట్విట్టర్ ఖాతాను నిలిపివేయాలని ట్విట్టర్‌కు సిఫార్సు చేసింది. ఈ అంశంపై నెటిజన్లు రెండు రకాలుగా చీలిపోయారు. కొంత మంది సిద్ధార్థ్‌కు మద్దతుగా మరికొంతమంది సైనాకు సపోర్ట్‌గా స్పందిస్తున్నారు . ఇటీవలే ఏపీలో టిక్కెట్ల అంశంపై సిద్ధార్థ్ చేసిన ట్వీట్లు వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఆయన జాతీయ అంశాన్ని నెత్తికెత్తుకున్నారు. అయితే సిద్ధార్థ్‌కు ఇవేమీ కొత్త కాదు..