హైదరాబాద్ కేంద్రంగా తెలుగు రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న రియల్ ఎస్టేట్ కంపెనీలు ఏకంగా రూ. ఎనిమిది వందల కోట్ల మేర అక్రమ నగదు చెలామణికి పాల్పడ్డాయని ఐటీ శాఖ గుర్తించింది. మూడు రోజుల పాటు హైదరాబాద్‌తో పాటు అనంతపురం, తాడిపత్రి, బెంగళూరుల్లో నిర్వహించిన సోదాల్లో అనేక బ్లాక్ లావాదేవీలు గుర్తించారు. చాలా వరకు ఆధారాలను .. చివరికి సాఫ్ట్‌వేర్‌ను కూడా ధ్వంసం చేసి వీలైనంతగా తమ అక్రమాలు బయటపడకుండా ఆయా కంపెనీలు ప్రయత్నించాయి.
మూడు రోజుల పాటు నిర్వహించిన సోదాల్లో దాదాపుగా రూ. 800 కోట్ల అక్రమ లావాదేవీలను గుర్తించినట్లుగా ఐటీ శాఖ ప్రకటించింది. రూ. కోటి అరవై లక్షల నగదును కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపింది. సాధారణంగా ఐటీ కంపెనీ సోదాలు చేసిన కంపెనీల పేర్లను ఎప్పుడూ వెల్లడించదు. నాలుగు రోజుల క్రితం నవ్య డెలవపర్స్, రాగమయూరి బిల్డర్స్,స్కాంధాన్షి రియల్టర్స్ వంటి కార్యాలయాల్లో సోదాలు జరిగాయి. దీంతో ఈ కంపెనీలకు చెందిన వివరాలేనని భావిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లోని పెద్దగా పబ్లిసిటీ చేసుకోకపోయినప్పటికీ భారీ వెంచర్లు వేసే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాయి ఈ కంపెనీలు. కొద్ది రోజుల క్రితం.. ఏడాదిన్నర క్రితమే ప్రారంభమైన ఓ ఐటీ కంపెనీపై దాడి చేసి దాదాపుగా రూ. డెభ్బై కోట్ల నగదును ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత మరికొన్ని కంపెనీలపైనా ఐటీ దాడులు చేశారు. వందల కోట్ల బ్కాల్ దందా బయటపడింది. తుదపరి విచార