టాలీవుడ్ ఏకతాటిపైన లేదని బయట నుంచి వినిపిస్తున్న విమర్శలను అడ్వాంటేజ్ తీసుకుని వివాదాన్ని మరింత పెంచాలని నందమూరి బాలకృష్ణ అనుకోలేదు. టిక్కెట్ ఇష్యూలో చిత్ర పరిశ్రమ పై వస్తున్న కామెంట్లను ఆయన తెలివిగా తిప్పి కొట్టారు. టాలీవుడ్ రిప్రజెంటేషన్ ఇచ్చినా ఏపీ ప్రభుత్వంలో పట్టించుకునేవారెవరున్నారని ఆయన ప్రశ్నించారు. అఖండ విజయోత్సవంలో పాల్గొన్న ఆయనను టిక్కెట్ల అంశంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నలు అడిగారు. ఈ సందర్భంగా నీ పరిశ్రమ కలసికట్టుగా ఉండాలన్నారు. టికెట్ ధరలపై చిత్ర పరిశ్రమ తీసుకునే నిర్ణయానికే కట్టుబడి ఉంటామని చెప్పారు.
అయితే ఇండస్ట్రీ నుంచి ఎవరూ పెద్దగా బాధ్యత తీసుకోకపోవడం.. సమస్యను సరిగ్గా ప్రభుత్వం ఎదుట రిప్రజెంట్ చేయలేదని వస్తున్న విమర్శలను జర్నలిస్టులు బాలకృష్ణ దృష్టికి తీసుకెళ్లారు. దీనికి బాలకృష్ణ అక్కడ వినిపించుకునే నాథుడెక్కడని సమాధానం ఇచ్చారు. ఇటీవల టిక్కెట్ల ఇష్యూలో ఎవరి వాదన వారు వినిపిస్తున్నారు. మా అధ్యక్షునిగా ఉన్న మంచు ఫ్యామిలీ బాధ్యత తీసుకోకపోగా.. కొంత మందే పెత్తనం చేస్తున్నారని అందరూ కలిసి వెళ్లాలని ఓ లేఖ రాశారు.
దీనిపై సి.కల్యాణ్ కూడా స్పందించారు. తర్వాతఅందరూ సైలెంటయ్యారు. సినీ పరిశ్రమలో రెండు వర్గాలున్నా… బాలకృష్ణ మాత్రం.. ఏదైనా అంతర్గతంగా ఉండాలని.. బయటకు మాత్రం చిత్రపరిశ్రమ లోపాలను కూడా కవర్ చేస్తున్నారు. ఇప్పటి వరకూ టిక్కెట్ల అంశంపై అందరూ సంయమనం పాటిస్తున్నారు. దాన్ని అలుసుగా తీసుకుని వైసీపీ నేతలు చెలరేగిపోతున్నారు.