భారతీయ జనతా పార్టీ సోషల్ మీడియా ప్రచారంలో కింగ్. అబద్దాలైనా అసువుగా ప్రచారం చేస్తుంది.అందుకే ఆ పార్టీ సోషల్ మీడియాకు వాట్సాప్ యూనివర్శిటీ అని పేరు పెట్టారు. కానీ ఎలా ఇలా సాధ్యమవుతోందనేది చాలామందికి అర్థం కాలేదు. కానీ ఇప్పుడిప్పుడే వారి సైబర్ తెలివితేటలు వెలుగులోకి వస్తున్నాయి. పెగాసస్ వ్యవహారాన్ని మించి ప్రస్తుతం దేశంలో సోషల్ మీడియా ద్వారా ప్రజల బుర్రలు ఖరారు చేసే కుట్ర జరిగిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
బీజేపీ సోషల్ మీడియాలో పని చేసి ఇటీవల బయటకువచ్చిన ఓ యువతి.. టెక్ ఫాగ్ అనే యాప్ గురించి సంచలన విషయాలు బయట పెట్టింది. బీజేపీ ఐటీ సెల్‌తో సంబంధాలు ఉన్న కొంతమంది వ్యక్తులు టెక్ ఫాగ్ యాప్‌ను ఉపయోగించి ఇన్‌యాక్టివ్‌గా ఉన్న వాట్సాప్ ఖాతాల నియంత్రణ, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ట్రెడింగ్లో ఉన్న విషయాలను హైజాక్ చేస్తున్నారు. బిజెపిపై విమర్శలు చేస్తున్న వారిని వేధించడం, ప్రజల అభిప్రాయాలను తారుమారు చేయడం .. న్యూస్ ఫ్లాట్‌ఫామ్స్‌లో కథనాలను భారీగా మార్చడానికి, ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్ ఫ్లాట్‌ఫారమ్‌లకు చొచ్చుకుపోవడమే కాకుండా, సోషల్ మీడియా సందేశాలను భద్రత పర్చడం వంటివి ఈ టెక్ ఫాగ్ చేస్తుంది.
టెక్ ఫాగ్ యాప్ సొంతంగా ట్విట్టర్, ఫేస్బుక్ ఖాతాలు క్రియేట్ చేస్తుంది. రీట్వీట్లు, ఫేస్బుక్లో పోస్టులను ఆటోమేటిక్‌గా షేర్ చేస్తుంది. ముందుగా టైప్ చేసి పెట్టిన సందేశాలతో ఆటోమేటిక్‌గా రిైప్లెలు ఇస్తుంది. క్రియాశీలకంగా లేని వాట్సాప్ నంబర్లను హైజాక్ చేస్తుంది. టోకెన్ థెఫ్ట్ అనే సాంకేతికత ద్వారా ఆ నంబర్ల నుంచి సందేశాలు పంపిస్తుంది. క్రియాశీలకంగా లేని వాట్సాప్ నెంబర్లను టెక్‌ఫాగ్ యాప్ గుర్తిస్తుంది. ఆర్తి శర్మ అనే బీజేపీ ఐటీసెల్‌లో పని చేసిన యువత.. టెక్ ఫాగ్ దుర్వినియోగం ఎలా జరుగుతుందో స్క్రీన్ షాట్లు పోస్ట్ చేశారు.
ఇది చాలా తీవ్రమైన అంశమని టెక్ నిపుణులు అంటున్నారు. విచారణ జరిపించాలని ఎడిటర్స్ గిల్డ్ సుప్రీంకోర్టుకు లేఖ రాసింది. విపక్ష పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. ఈ అంశంపై బీజేపీ ఇంకా అధికారికంగా స్పందించలేదు. కేంద్రం కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇలాంటివాటిలో మౌనం బీజేపీ విధానం.