కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆరోగ్య చికిత్స కోసం అమెరికా వెళ్లారు. ఆయన అక్కడ మూడు వారాల పాటు ఉంటారు. ఈ సందర్భంగా ఆయనకు బదులుగా ప్రభుత్వవ్యవహారాలు చూసుకోవడానికి ఎవరికైనా బాధ్యతలు ఇస్తారని అనుకున్నారు. కానీ పినరయి విజయన్ మాత్రం ఆస్పత్రి బెడ్ పై నుంచి కూడా పాలన చేస్తాను కానీ బాధ్యతలు మాత్రం వేర వారికిచ్చేది లేదని చెప్పి అమెరికా వెళ్లిపోయారు. అక్కడ్నుంచి ఈ ఆఫీస్ ద్వారా.. వర్చువల్ కేబినెట్ మీటింగ్లు కూడా నిర్వహిస్తానని ఆయన స్పష్టం చేశారు. విజయన్ తీరు.. కేరళలో కమ్యూనిస్టు పార్టీ నాయకులను చాలా ఆశ్చర్య పరిచింది.
కుటుంబ పార్టీలు అధికారంలో ఉంటే.. ఇలా చేసినా ఎవరూ పట్టించుకోరు. వేరే వారికి బాధ్యతలిస్తే… వచ్చే సరికి రాజకీయం మార్చేసి తనకు పదవి లేకుండా చేస్తారేమోనన్న భయం ఉంటుంది. గతంలో చికిత్స కోసం ఎన్టీఆర్ అమెరికా వెళ్లి వచ్చేలో పు ఏం జరిగిందే ఇంకా కథలు కథలుగా చెప్పుకుంటూనే ఉంటారు. ఈ కారణం ఏమో తెలియదు కానీ.. ఏ ముఖ్యమంత్రి అయినా ఆమెరికా కాదు ఎక్కడికి వెళ్లినా ఇతరులకు మాత్రం బాధ్యతలివ్వరు. కానీ కమ్యూనిస్టు పార్టీల్లో మాత్రం అలా ఉండదు.
ముఖ్యమంత్రి అందుబాటులో లేకపోతే తదుపరి సీనియర్ నేత బాధ్యతలు తీసుకుంటారు. కానీ ప్రస్తుతం కమ్యూనిస్టులకు దిక్కుగా ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం కేరళ కాబట్టి .. అక్కడి ప్రభుత్వాన్ని నడుపుతోందని విజయన్ కాబట్టి.. ఆయన కోరికను వ్యతిరేకించే సాహసం చేయలేకపోతున్నారు. అందుకే విజయన్ కూడా అమెరికా పోయినా .. బాధ్యతలు వేరే వారికి ఇవ్వడానికి ఇష్టపడలేదు.