జగన్ చిరంజీవి మధ్య జరిగిన భేటీ ఇప్పటికీ రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీస్తోంది. అసలు ఆ భేటి లో ఏం చర్చించారో బహిర్గత పరచాలని సిపిఐ నారాయణ డిమాండ్ చేశారు. వివరాల్లోకి వెళితే..
సినీ పరిశ్రమ సమస్యల కోసం మెగాస్టార్ చిరంజీవి ముఖ్యమంత్రి జగన్ తో ఏకాంతంగా సమావేశం కావడం చర్చకు దారి తీసింది. కొన్ని మీడియా చానల్స్ చిరంజీవికి జగన్ రాజ్యసభ టికెట్ ఆఫర్ చేశారని ప్రసారం చేయగా చిరంజీవి అసలు అటువంటిదేమీ లేదని ఆ వార్తలు నిరాధారం అని ఖండించారు. చిరంజీవి వివరణ తో ఈ భేటీ పై చర్చకు ఫుల్ స్టాప్ పడుతుంది అనుకుంటే, సిపిఐ నారాయణ దీనిపై తాజాగా వ్యాఖ్యలు చేసి ఈ అంశాన్ని మళ్లీ లైమ్ లైట్ లో ఉంచారు. సి పి ఐ నారాయణ మాట్లాడుతూ, జగన్ ఆహ్వానం మేరకే ఈ సమావేశానికి వచ్చానని, జగన్ తనను మాత్రమే రమ్మన్న కారణంగానే తాను ఒక్కడినే వచ్చానని చిరంజీవి చెబుతున్నారని, కానీ కొందరు వైసీపీ నేతలు మాత్రం చిరంజీవి తనకు తానుగా కావాలనుకొని జగన్ తో భేటీ అయ్యారని చెబుతున్నారని, దీనిపై జగన్ చిరంజీవిలు స్పష్టత ఇవ్వాలని సిపిఐ నారాయణ డిమాండ్ చేశారు. సినీ పరిశ్రమ సమస్యలు అన్నది ఒక పబ్లిక్ ఇష్యూ అని, దీనిపై జగన్ చిరంజీవి లు ఏకాంతంగా చర్చించాల్సిన అవసరం ఏముందని, అసలు వారిద్దరి మధ్య ఏమి చర్చ జరిగింది అన్నది బహిర్గత పరచాలని, ఈ వివరాలన్నీ ప్రజలకు తీరాల్సిందేనని నారాయణ డిమాండ్ చేశారు.
సిపిఐ నారాయణ డిమాండ్ కు చిరంజీవి కానీ వైఎస్సార్సీపీ నేతలు కానీ స్పందిస్తారా అన్నది వేచి చూడాలి