ఈ సంక్రాంతికి 4 సినిమాలొచ్చాయి. అందులో కామన్ పెద్ద సినిమా బంగార్రాజునే అయ్యింది. సూపర్ మచ్చీ గురించి ఎవరూ పట్టించుకోలేదు. హీరో, రౌడీ బోయ్స్ సినిమాల్లో కామన్ పాయింట్స్ చాలా ఉన్నాయి.
హీరో, రౌడీబోయ్స్.. ఈ రెండు సినిమాల్లోనూ హీరోలకు ఇదే తొలి సినిమా. హీరోతో అశోక్ గల్లా ఎంట్రీ ఇచ్చాడు. ఆయనకు సినీ, రాజకీయ నేపథ్యం ఉంది. రౌడీ బోయ్స్‌తో ఆశిష్ వచ్చాడు. దిల్ రాజు ఇంటి నుంచి వచ్చిన తొలి హీరో తను. ఈ రెండు సినిమాలకూ బాగా ఖర్చు పెట్టారు. టెక్నికల్ గా సౌండ్ ఉన్న వాళ్లని ఎంచుకున్నారు. ఓ సినిమాలో అనుపమ, మరో సినిమాలో.. నిధి అగర్వాల్ హీరోయిన్లు, హీరోలతో పోలిస్తే.. ఇద్దరూ స్టార్లే. సీనియర్లే. ఇద్దరు హీరోలూ.. తమ హీరోయిన్లకు లిప్ లాక్‌లు ఇచ్చేశారు. ఇలా.. చాలా కామన్ పాయింట్స్ ఈ రెండు సినిమాల్లో కనిపిస్తాయి.
హీరోతో పోలిస్తే.. రౌడీ బోయ్స్ కి కాస్త పాజిటీవ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. కాలేజీ నేపథ్యంలో ఉన్న సినిమా కావడంతో.. కుర్రాళ్లు రౌడీ బోయ్స్ చూడ్డానికి ఇష్టపడుతున్నారు. దాంతో వసూళ్లు కూడా రౌడీ బోయ్స్ కే ఎక్కువ. అయితే ఈ ఇద్దరు హీరోల్లోనూ ఈజ్ బాగుంది. డాన్సులు బాగా చేస్తున్నారు. అశోక్ గల్లా మంచి కథలు ఎంచుకుని, ఎక్స్ప్రెషన్స్ ని ఇంప్రూవ్ చేసుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇక ఆశీష్ నటనలో కాస్త వీక్ గా కనిపిస్తున్నాడు. అశోక్ తో పోలిస్తే… డాన్సులు బాగా చేస్తున్నాడు. ఆశిష్ వెనుక దిల్ రాజు ఉన్నాడు కాబట్టి… కథలపై బెంగ లేదు. మంచి కథల్ని ఎంపిక చేసుకుని నటనపై దృష్టి పెడితే… నిలబడే ఛాన్సుంది. మొత్తానికి సినిమా ఫలితాలు ఎలా ఉన్నా.. ఈ ఇద్దరూ ప్రామిసింగ్ గానే కనిపిస్తున్నారు. ఇద్దరూ రెండో సినిమా ప్రయత్నాల్లోనే ఉన్నారు. అందులో క్లిక్కయితే… భవిష్యత్తుకు పునాది పడినట్టే.