రామ్ – లింగుస్వామి కాంబినేషన్లో ఓ సినిమా రూపుదిద్దుకుంటోంది. దీనికి `ది వారియర్` అనే టైటిల్ ఫిక్స్ చేశారు. రామ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో రివీల్ అయ్యాడు. తనకు పోలీస్ గెటప్ పర్ఫెక్ట్ గా సూటయ్యింది. నిజంగానే వారియర్ లా ఉన్నాడు. టైటిల్ బాగుంది కానీ, ఈ టైటిల్ పై వార్ జరిగే అవకాశం ఉంది.
ఎందుకంటే… ఇదే టైటిల్ ఇది వరకు వేరే సంస్థలో రిజిస్టర్ చేశారు, హవీష్ కథానాయకుడిగా ఓ సినిమాకి `వారియర్` అనే టైటిల్ పెట్టారు, ఈరోజు ఉదయమే ఈ టైటిల్ రివీల్ చేశారు. రెండు గంటల తరవాత రామ్ సినిమా టైటిల్ ఎనౌన్స్ అయ్యింది. రామ్ – లింగు స్వామి సినిమాకి `ది వారియర్` అనే టైటిల్ పెడతారన్న విషయం తెలుసుకున్న.. హవీష్ టీమ్ అర్జెంటుగా, వాళ్ల కంటే ముందు వారియర్ టైటిల్ ని వదిలింది. ఇప్పుడు లింగు స్వామి టీమ్ ఇరకాటంలో పడింది. ఒకే టైటిల్ తో రెండు సినిమాలు, ఏక కాలంలో రూపుదిద్దుకోవడం ఈమధ్య జరిగింది. కానీ.. చివరికి ఒక సినిమాకే ఆ టైటిల్ కేటాయించారు. ఇద్దరు నిర్మాతల్లో ఎవరు ముందు ఈ టైటిల్ రిజిస్టర్ చేయించారో తెలీదు. టైటిల్ రిజిస్ట్రేషన్ విషయంలో ఛాంబర్ లో నిబంధనలు ఈ మధ్య మారాయి. దాన్ని బట్టి.. వారియర్ టైటిల్ ఈ రెండు సినిమాల్లో ఎవరికి దక్కుతుందో వాళ్లే
తేల్చాలి. ఇద్దరికీ ఇదే టైటిల్ కావాలంటే… `ది వారియిర్` కాస్త `రామ్ వారియిర్..` గా మారే అవకాశం వుంది.