మహింద్రా గ్రూప్ ఓనర్ ఆనంద్ మహింద్రా కేటీఆర్‌పై మరోసారి ప్రశంసల జల్లు కురిపించారు. తన చిరకాల స్వప్నాన్ని నిజం చేసినందుకు కేటీఆర్‌కు ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు. దీనికి కారణం హైదరాబాద్‌లో ఫార్ములా -ఈ రేసుల నిర్వహణకు ప్రభుత్వం ముందుకు రావడం., ఈ మేరకు సోమవారం ఫార్ములా- ఈ సంస్థతో కేటీఆర్ఒప్పందం చేసుకున్నారు. ప్రభుత్వం తరపున రేసింగ్‌కు అవసరమైన రోడ్లు.. కొన్ని సౌకర్యాలు కల్పించేందుకు అంగీకరించారు. మరికొన్ని ఏర్పాట్లు గ్రీన్ కో చేస్తుంది. ఇది అంతర్జాతీయంగా హైదరాబాద్ పేరు ప్రతిష్టలను మరింత ఇనుమడింప చే
స్తుదంనికే కేటీఆర్ భావిస్తున్నారు. ఈ ఫార్ములా -ఈ రేసు టీముల్లో ఆనంద్ మహింద్రాకు ఓ టీమ్ ఉంది. ఆయన సొంత గడ్డపై తన టీమ్ కార్లను తిప్పుతూంటే చూసి కేరింతలు కొట్టాలని ఆశ పడుతున్నారు. ఆ కోరికను కేటీఆర్ ఇలా తీరుస్తున్నారన్నమాట. కేటీఆర్‌పై ఆనంద్ మహింద్రా ఇలా ఫ్రశంసలు కురిపించడం ఇదే మొదటి సారి కాదు. గతంలో టెక్ మహీంద్రా సీఈవో సీపీ గుర్నానీ హైదరాబాద్‌లో పర్యటించినప్పుడు కేటీఆర్ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కార్యక్రమం జరుగుతుండగా ఒక్కసారిగా వర్షం మొదలైంది. వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్ సీపీ గుర్నానీ తడవకుండా గొడుగు పట్టారు. ఇది మహింద్రా గ్రూప్ చైర్మన్ ను ఆనంద పరిచింది. వండర్‌ఫుల్ కేటీఆర్… నాయకత్వం, వినయం అనేవి విడదీయరాని అంశాలను అనడానికి మీరొక అసాధారణమైన ఉదాహారణగా నిలిచారు అంటూ అభినందించారు. ఇప్పుడు రేసింగ్ విషయంలో మరోసారి అభినందనలు అందుకున్నారు.