రామ్ – లింగు స్వామి కాంబినేషన్‌లో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి `ది వారియర్` అనే పవర్‌ఫుల్ టైటిల్ ఫిక్స్ చేశారు. రామ్ ని పోలీస్ గెటప్‌లో చూపించారు. రామ్ పోలీస్ గా కనిపించడం ఇదే తొలిసారి. కాబట్టి… ఆ లుక్ తనకు కొత్తగా ఉండొచ్చు. అయితే… ఈ సినిమాలో రామ్ డాక్టర్ గానూ కనిపించబోతున్నాడట. ఒకే వ్యక్తి అటు పోలీస్ గా, ఇటు డాక్టర్‌గా రెండు వృత్తులు చేయడం అసాధ్యం కాబట్టి.. ఈ విషయంలో ఏదో ట్విస్టు ఉండే ఉంటుంది. రామ్ ద్విపాత్రాభినయం ఏమైనా చేయబోతున్నాడా? అనే అనుమానాలూ ఉన్నాయి. `రెడ్`లో రామ్ ది డ్యూయర్ లోలే. `వారియర్` కూడా అలాంటి కథే అవునా? కాదా? అనేది తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాలి. రాయల సీమ నేపథ్యంలో సాగే కథ ఇది. ఫ్యాక్షనిజం కూడా టచ్ చేశార్ట. ఓ ఫ్యాక్షన్ ముఠాని పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ ఎలా ఎదుర్కొన్నాడన్నదే కథ. కాకపోతే.. హీరో పోలీస్ అవ్వడం వెనుక వెరైటీ స్కీమ్ ఉంటుందట. మరి దానికీ ఈ డాక్టర్ ఎపిసోడ్ కీ ఏమైనా లింకు ఉటుందేమో చూడాలి.