ఈ సంక్రాంతికి విడుదలైన సినిమాల్లో `హీరో` ఒకటి. గల్లా అశోక్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. డెబ్యూ హీరోనే అయినా ఏకంగా రూ.20 కోట్లు ఖర్చు పెట్టారు. పాటల్లో హంగామా కనిపించింది. అయితే.. హీరో – హీరోయిన్లపై తెరకెక్కించిన `బుర్ర పాడౌతాదే` పాట తెరకెక్కించారు. అయితే ఆ పాట కథకి అడ్డొస్తుందని తీసేసి, దాన్ని ఎండ్ టైటిల్స్ లో పెట్టారు. ఆ పాట విలువ అక్షరాలా రూ.2 కోట్ల రూపాయలు. రెండు కోట్ల పాట.. రోలింగ్ టైటిల్స్ లో వేశారంటే.. ఆశ్చర్యం వేస్తుంది. ఈ పాటని ఏకంగా 20 రోజుల పాటు తెరకెక్కించారని సమాచారం.
ఈ సినిమా కోసం నిధి అగర్వాల్ నుంచి 50 కాల్షీట్లు తీసుకున్నార్ట. అందుకోసం రూ.50 లక్షలు ఇచ్చారు. అయితే… సగం షూటింగ్ అయ్యేలోగా.. 50 కాల్షీట్లు ఖర్చయిపోయాయని, మరో రూ.50 లక్షలు ఇస్తే గానీ నిధి డేట్లు ఇవ్వలేదని టాక్. అంటే ఒక్క నిధి అగర్వాల్ కే కోటి రూపాయలు సమర్పించుకోవాల్సివచ్చిందన్నమాట. ఇంతా పోగేస్తే… నిధి వల్ల ఈ సినిమాకి కొత్తగా వచ్చే మైలేజీ కూడా ఏం లేకుండా పోయింది. హీరో పక్కన అక్కలా కనిపించింది. ఇలాంటి వేస్టేజీలు ఈ సినిమాకి చాలా అయ్యాయని, అందుకే చివరికి 20 కోట్ల లెక్క తేలిందని సమాచారం.