ఏపీ ప్రభుత్వం ఈ రోజు అత్యవసర కేబినెట్ భేటీ నిర్వహిస్తోంది. ఈ భేటీ ఎజెండా ఏమిటో స్పష్టత లేదు. కానీ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం హైకోర్టులో పిటిషన్ వేసిందని తెలిసిన తర్వాత ఈ కెబినేట్ భేటీ గురించిన సమాచారం బయటకు వచ్చింది. గెజిటెడ్ అధికారులు వేసిన పిటిషన్‌లో కీలకమైన అంశాలు ఉన్నాయి. విభజన చట్టంలోని 78(1 ) ప్రకారం తమకు వచ్చే జీతం, అలవెన్స్‌లు తగ్గించే అధికారం ప్రభుత్వానికి లేదని వారు వాదిస్తున్నారు.
ప్రస్తుతం అలవెన్స్‌లతో పాటు … ఐఆర్ కన్నా తక్కున ఫిట్‌మెంట్ ఖరారు చేయడం వల్ల జీతం తగ్గిపోతోంది. డీఏలను జీతంలో కలిపి పెరుగుతుందని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ డీఏలకు .. బేసిక్ శాలరీ.. అలవెన్స్‌లకు సంబంధం లేదు. జీతం తగ్గించడం లేదని.. మొత్తం చేతికి వచ్చే శాలరీనికోర్టులో చూపించడానికి అవకాశం లేదు. ఈ విషయం కోర్టులో నిలబడదు. అందుకే ఇప్పుడు అలవెన్స్‌ల తగ్గింపు కోర్టులో నిలబడదన్న అభిప్రాయం వినిపిస్తోంది.
ఈ కారణంగానే ప్రభుత్వం హడావుడిగా కేబినెట్ భేటీ ఏర్పాటు చేసిందని… దానికి పరిష్కారంగా కోర్టులో విచారణ ప్రారంభం కాక ముందే ఆర్డినెన్స్ తెచ్చేందుకు ఆమోదం తెలుపుతారని అంటున్నారు. ఏపీ ప్రభుత్వం ఏం చేయాలనుకుంటే అది చేస్తోంది.. చట్ట విరుద్ధమా కాదా అన్నది ఆలోచించడం లేదు. ఎంత మంది సలహాదారులున్నా అదే అదే పరిస్థితి.