ఆంధ్రప్రదేశ్ మంత్రి అనిల్ కుమార్‌పై తెలంగాణలో పోలీసు కేసు నమోదయినట్లుగా తెలుస్తోంది. నెల్లూరు జిల్లాలో పెన్నా కాల్వకు చెందిన టెండర్ల విషయంలో జరిగిన గోల్మాల్ వ్యవహారం హైదరాబాద్‌లో జరిగింది. ఆ టెండర్లను ఖరారు చేసేముందు రివర్స్ టెండర్లకు వెళ్లారు. అయితే అందులో ఎవరూ పాల్గొనవద్దని మంత్రి అనిల్ కుమార్ బాబాయ్ , నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్‌కుమార్ యాదవ్ బెదిరించినట్లుగా కాంట్రాక్టర్లు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌లో ఈ బెదిరింపులకు పాల్పడటంతో కాంట్రాక్టర్ ్ఫిర్యాదు మేరకు డిసెంబర్ 24వ తేదీన 506, 504 ఐపీసీ సెక్షన్లతో పోలీసులు కేసు నమోదు చేశారు.
ఫోను, వాట్సప్ కాల్స్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారని కాంట్రాక్టర్ ఫిర్యాదు చేశారు. ఈ ఎఫ్ఐఆర్ను నెల్లూరు టీడీపీ నేతలు మీడియాకు విడుదల చేశారు. ఈ కేసు విషయంలో మంత్రి అనిల్ బాబాయ్.. రూప్‌కుమార్‌కు, మరో వ్యక్తికి నోటీసులు ఇచ్చారు. పోలీసులు ఇచ్చిన వివరాల్లో మరొక ఫోన్ నంబరు ఉందని, అది మంత్రి అనిల్‌కుమార్ యాదవ్‌దని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఈ కేసులో త్వరలో ఆయనకు పోలీసులు నోటీసులు ఇస్తారని అంటున్నారు.
అయితే ఇప్పుడు కేసును ఉపసంహరించుకోవాలని కాంట్రాక్టర్‌తో రూప్ కుమార్ బేరసారాలకు దిగుతున్నారని నెల్లూరు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మొత్తంగా ఈ కేసు రాజీ పడిపోతారో లేకపోతే.. పొరుగు రాష్ట్రంలో మంత్రి అనిల్‌పై కేసు నమోదవుతుందో చూడాలి. నెల్లూరు రాజకీయాల్లో ఈ కేసు మాత్రం కలకలం రేపుతోంది.