కొడాలి నాని గుడివాడలో కేసినో నిర్వహించి అడ్డంగా దొరికిపోయారు. ఆధారాలు ఒకదాని తర్వాత ఒకటి వెల్లువగా బయటకు వస్తూనే ఉన్నాయి. ఈ అంశంపై వైసీపీ తన విధానాన్ని ప్రకటించాల్సిన సమయంలో.. అడ్డగోలుగా కొడాలి నానిని సమర్థిస్తూ.. టీడీపీ హయంలో జరగలేదా అనే వాదనతో తెర ముందుకు వచ్చేశారు. వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ప్రెస్మీట్ పెట్టి.. టీడీపీ హయాంలోనూ విచ్చలవిడిగా కేసినోలు జరిగాయని.. అప్పుడు ఈ టీడీపీ నేతంతా ఎక్కడకు వెళ్లారని ప్రశ్నించారు.
టీడీపీ హయాంలో కేసినోలు జరిగితే టీడీపీ నేతలే ఏర్పాటు చేసి ఉంటారు.. మరి వైసీపీ నేతలు అప్పుడు బయట పెట్టకుండా ఏం చేశారు అనే ప్రశ్న వస్తుందని తెలిసినా అంబటి రాంబాబు ఏ మాత్రం తగ్గలేదు. తాము చేసి దొరికిపోయాం కాబట్టి.. అదే ఎదుటి వాళ్లు కూడా చేశారని బురద పూసేస్తే బ్యాలెన్స్ అయిపోతుందన్నది వైసీపీ వ్యూహం. అన్ని విషయాల్లోనూ అంతే. ఏదైనా తప్పు చేస్తే.. తాము తప్పు చేయలేదని చెప్పరు.. ఏం మీరు చేయలేదా అంటారు. ఎక్కడ చేశారో చెప్పరు. ఇక్కడా అంతే.. వ్యక్తంచేశారు.అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని అంబటి రాంబాబు చెప్పుకొచ్చారు.
సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక క్లబ్బులపై ఉక్కుపాదం మోపారని ..రాష్ట్రంలో ఎక్కడైనా ఇప్పుడు క్లబ్ కల్చర్ ఉందా? అంటూ అంబటి రాంబాబు ప్రశ్నించారు. ప్రతీ ఊళ్లో పేకాట శిబిరాలను… క్లబ్బులను ఎమ్మెల్యేలు, మంత్రులే నిర్వహిస్తున్నారని సాక్ష్యాలతో సహా అనేక సార్లు బయటకు వచ్చింది. మంత్రి గుమ్మనూరు జయరాం ఊళ్లోనే పేకాట క్లబ్ వెలుగులోకి వచ్చింది. మొత్తంగా కేసినో గతంలో టీడీపీ నేతలు నిర్వహించారు.. తాము నిర్వహిస్తే తప్పేంటన్నట్లుగా వైసీపీ అధికారిక స్పందన ఉంది. ఇక ఇలాంటి కేసినోలు పలు చోట్ల జరుగుతాయేమో చూడాలి!