కీర్తి సురేష్ కమర్షియల్ సినిమాలు చేస్తూనే తన అభిరుచికి తగ్గ కథలని ఎంచుకుంటుంది. ఇప్పుడు ఆమె నుంచి ఓ స్పోర్ట్స్ డ్రామా ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే గుడ్ లక్ సఖి. నగేష్ కకునూర్ దర్శకుడు. జగపతి బాబు, ఆది పినిశెట్టి కీలక పాత్రలు పోషించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ బయటికి వచ్చింది. పుట్టుకతోనే బ్యాడ్ లక్ ని వెంటేసుకు తిరుగుతున్న ఓ పల్లెటూరి అమ్మాయి .. స్టార్ షూటర్ గా ఎలా ఎదిగిందనేది కథ. దాదాపు కథ మొత్తం ట్రైలర్ లోనే చెప్పేశారు. అయితే ఆమె జర్నీ ఎంత ఆసక్తి సాగిందనేది ఇందులో కీలకం. కీర్తి సురేష్ కొత్తగా కనిపించింది. చిత్తూరు మాండలికంతో ఆకట్టుకుంది. జగపతి బాబు కోచ్ గా కనిపించారు. ట్రైలర్ లో వినిపించిన డైలాగ్స్ ఆకట్టకున్నాయి. చిత్ర దర్శకుడు నగేష్ హైదరాబాదీ. అయితే బాలీవుడ్ లో స్థిరపడ్డారు. విలక్షణమైన దర్శకుడిగా పేరుతెచ్చుకున్నారు. చాలా రోజుల తర్వాత ఆయన నుండి ఓ తెలుగు సినిమా రావడం ఆసక్తికరంగా వుంది. జనవరి 28 న గుడ్ లక్ సఖి ప్రేక్షకుల ముందుకు రానుంది.