ఉప్పెనతో ఓ సూపర్ డూపర్ హిట్టు అందుకున్నాడు బుచ్చిబాబు. ఆ వెంటనే ఎన్టీఆర్ తో సినిమా చేసే ఛాన్స్ వచ్చింది. ఎన్టీఆర్ – బుచ్చిబాబు కాంబినేషన్ పక్కా. కాకపోతే… ఎన్టీఆర్ కి ఉన్న వరుస కమిట్మెంట్స్ వల్ల బుచ్చిబాబు సినిమా ఆలస్యం అవుతూ వచ్చింది. ఆర్.ఆర్.ఆర్ అయిపోయాక.. కొరటాల శివతో ఓ సినిమా చేయాలి ఎన్టీఆర్. ఆ తరవాత అట్లీ లైన్లో ఉన్నాడు. ఆ తరవాతే… బుచ్చి సినిమా ఉంటుంది.
అయితే ఇప్పుడు అట్లీ సినిమా వెనక్కి వెళ్లిపోయింది. అట్లీ ఎన్టీఆర్ తో పాటుగా బన్నీకి కూడా ఓ కథ చెప్పి ఉంచాడు. బన్నీ, ఎన్టీఆర్లలో ఎవరు ముందుగా తన సినిమా ఓకే చేస్తే వాళ్లతో కమిట్ అయిపోదామనుకున్నాడు. ఇప్పుడు బన్నీ ముందుకొచ్చి… అట్లీ కథకి ఓకే చెప్పేశాడు. సో.. అట్లీ.. బన్నీ ప్రాజెక్టుతో బిజీ అయిపోతాడు. కాబట్టి… ఇక్కడ బుచ్చిబాబుకి లైన్ క్లియర్ అయ్యింది. కొరటాల శివతో సినిమా అవ్వగానే.. బుచ్చి బాబు కథే పట్టాలెక్కే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఎన్టీఆర్ కోసం బుచ్చి ఓ స్పోర్ట్స్ డ్రామాని సిద్ధం చేశాడు. ఇది కూడా పాన్ ఇండియా స్థాయిలోనే చేయాలన్నది ప్లాన్.