ప్రభాస్ ఇప్పుడు ఫుల్ స్వింగులో ఉన్నాడు. కథలు ఓకే చెప్పడానికీ, అడ్వాన్సులు తీసుకోవడానికి ఏమాత్రం మొహమాట పడడం లేదు. ప్రభాస్ చేతిలో చాలా సినిమాలున్నాయిప్పుడు. ఆదిపురుష్, సలార్. ప్రాజెక్ట్ కె సెట్స్‌పై ఉన్నాయి. సందీప్ రెడ్డి వంగా లైన్లో ఉన్నాడు. రెండ్రోజుల నుంచీ మారుతితో సినిమా ఉందని ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. దాదాపుగా ఆ ప్రాజెక్ట్ కూడా ఓకే. ఇప్పుడు కరణ్ జోహార్ తో ఓ సినిమా చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు. ధర్మా ప్రొడక్షన్స్ పతాకంపై ప్రభాస్ తో ఓ సినిమా చేయడానికి కరణ్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ సినిమాకి నాగ అశ్విన్ దర్శకత్వం వహించే ఛాన్స్ వుంది. ఇప్పటికే ప్రభాస్ – అశ్విన్‌ల కాంబోలో `ప్రాజెక్ట్ కె` రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రాజెక్ట్ కె అవ్వగానే.. మళ్లీ ప్రభాస్‌తోనే పనిచేయాలనుకుంటున్నాడు నాగ అశ్విన్. కరణ్ జోహార్ లాంటి నిర్మాత వస్తే.. ఇక ఈ కాంబోకి అడ్డేముంది? ప్రాజెక్ట్ కెని బాలీవుడ్ లో ప్రమోట్ చేసే బాధ్యత కూడా కరణ్ నే స్వయంగా తీసుకున్నాడట. టాలీవుడ్ సినిమాలకు బాలీవుడ్ లో ప్రమోషన్ కల్పిస్తోంది కరణ్ జోహారే. అందుకు సంబంధించి కరణ్ కు భారీ ప్యాకేజ్ కూడా అందుతోంది.