సింగర్ సునీత భర్త, మ్యాంగో వీడియోస్ సంస్థ అధినేత రామ్ చిక్కుల్లో పడ్డారు. శ్రీనగర్ కాలనీలోని మ్యాంగో యూట్యూబ్ ఛానల్ కార్యాలయాన్ని గౌడ కుల సంఘాలు ముట్టడించాయి. గౌడ మహిళల మనోభావాలు దెబ్బతీసేలా మ్యాంగో యూట్యూబ్ ఛానల్ లో వీడియోలు పెట్టారంటూ అందోళన చేశాయి. ఇటివల మ్యాంగో వీడియో ఒక వీడియో ప్రచారం చేసింది. ఈ వీడియోలో గౌడ మహిళలను వేశ్యలుగా చిత్రీకరించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగర్ సునీత భర్త, మ్యాంగో వీడియోస్ సంస్థ అధినేత రామ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మ్యాంగో యూట్యూబ్ ఛానల్ నుంచి తక్షణమే వీడియోస్ చేసి డిలీట్ చేసి క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. అందోళనకారులని పోలీసులు అదుపు చేశారు. ఈ వివాదంపై రామ్ స్పందించాల్సివుంది.