వచ్చే ఏడాది జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్నదానిపై కొద్ది రోజుల నుంచి రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఎల్బీ నగర్, కల్వకుర్తి అంటూ రకరకాల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. కానీ రేవంత్ రెడ్డి తాను మళ్లీ కొడంగల్ నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు. రేవంత్ రెడ్డి రెండు సార్లు గెలిచిన ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఎక్కడా లభించనన్ని సభ్యత్వాలు లభించాయి. కొడంగల్ లో 75 వేల మంది కాంగ్రెస్ సభ్యత్వం తీసుకున్నారు. దీంతో ఆయన ఎమోషనల్ అయ్యారు.
కొడంగల్ నేతలకు రాహుల్ గాంధీతో సన్మానం చేయిస్తానన్నారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా తాను ఎన్నో అభివృద్ధి పనులు చేయించానని.. కానీ ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కొడంగల్ ను దత్తత తీసుకున్న కేటీఆర్ ఎక్కడ అని మండిపడ్డారు. ఈ మూడేళ్లలో కొడంగల్ రోడ్లపై తట్టెడు మట్టి తీయలేదన్నారు. 2018లో ఐదుగురు మంత్రులు కోస్గి బస్ డిపోకు శంకుస్థాపన చేసి.. ఇంత వరకూ ఎందుకు కట్టలేదో చెప్పాలన్నారు. నియోజకవర్గ అభివృద్ధిపై చర్చకు రావాలని టీఆర్ఎస్ నేతలకు సవాల్ చేశారు.
ఈ మూడేళ్లు తాను కావాలనే కొడంగల్ రాలేదని… వస్తే అభివృద్ధి ని అడ్డుకుంటున్న అంటరని రాలేదన్నారు.రేవంత్ర ెడ్డి తన నియోజకవర్గంలో సభ్యత్వాల విషయంలో పట్టు నిరూపించుకున్నారు. 75 వేల సభ్యత్వాలు అయ్యాయి. ఓటింగ్ సమయంలో అందరితో ఓట్లు వేయించుకుంటే తిరుగులేని విజయం వస్తుందనడంలో సందేహం లేదు.