ఏపీ ప్రభుత్వానికి “అర్హులు” అనే వాళ్లు చాలా ముద్దు. ఏ పథకంలో అయినా అర్హులు అనే కాన్సెప్ట్‌ను అధికంగా వాడుతూ ఉంటుంది. అయితే ఈ అర్హులు ప్రతీ సారి తగ్గేలా చూసుకుంటూ ఉంటారు. కానీ ఓ పథకంలో మాత్రం ఇలాంటి అర్హులను తేల్చడానికి పెట్టిన కండిషన్లను సంతృప్తి పరిస్తే.. మిగిలిన లబ్దిదారులు కేవలం ఐదు వందల మంది. దీంతో ప్రభుత్వానికి కూడా కాస్త సిగ్గనిపించింది. వెంటనే రూల్స్ మార్చాలని మరింత మందికి పథకం వర్తింప చేద్దామని ఆదేశించింది.
వైఎస్ జగన్ ప్రభుత్వం పాస్టర్లకు నెలకు రూ. ఐదు వేలు జీతంలాగా ఇవ్వాలని డిసైడయింది. ఇందు కోసంగతంలో దరఖాస్తులు స్వీకరించారు. వాలంటీర్లుకూడా వెరిఫికేషన్ చేశారు. దాదాపుగా పదహారు వేల మందికిపైగా చర్చి పాస్టర్లు దరఖాస్తు చేసుకున్నారు. వీరందర్నీ అర్హులుగా గుర్తించి గతంలో కరోనా సాయం కూడా ఏపీ ప్రభుత్వం చేసింది. కానీ ఇప్పుడు వారెవరూ .. నెలకు రూ. ఐదు వేలు పొందడానిక అర్హులు కారని.. కేవలం ఐదు వందల మంది మాత్రమే అర్హులని తేల్చింది. ఎందుకంటే.. ప్రభుత్వం పెట్టిన మూడు నిబంధనల ప్రమాణాలు వీరిలో ఐదు వందల మంది మాత్రమే అందుకున్నారు.
అయితే మరీ ఇంత తక్కువగా ఐదు వందల మందికి ఎలా పథకం అమలు చేస్తామని.. హాఫ్ పేజీ కాదు కదా అందులో సగం పేజీ యాడ్ ఇచ్చేంత బలం కూడా పథకానికి ఉండదని ప్రభుత్వం భావించి.. నిబంధనలు సడలించాలని నిర్ణయించింది. మరింత మరింత మంది అర్హులు పథకంలోకి వచ్చేా అర్హతల్ని మార్చాలని భావించి ఆదేశాలు జారీ చేసింది. మూడు షరతుల్లో ఓ షరతును తొలగించి ఐదారు వేల మందికైనా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మామూలుగా అయితే ఆలోచించేవారు కాదేమోకానీ.. ఇక్కడ రెండున్నరేళ్లయిపోయింది..ఇంకా మేనిఫెస్టోలో చెప్పినట్లుగా పాస్టర్లకు ఇస్తామన్నది ఇవ్వలేదు కాబట్టి.. ఎలాగోలా మీట నొక్కాల్సిన అవసరం కనిపిస్తోంది మరి !